Flipkart Sale నుంచి ఈరోజు మంచి సౌండ్ బార్ డీల్ అందుబాటులో ఉంది. ఇండియన్ మార్కెట్ లో రీసెంట్ గా విడుదలైన ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ డేస్ సేల్ నుంచి స్పెషల్ ప్రైస్ తో సేల్ అవుతోంది. నిన్నటి వరకు 10 వేల బడ్జెట్ లో లభించిన ఈ సౌండ్ బార్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి రూ. 8,999 ఆఫర్ ధరకు అందుకోవచ్చు.
ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ డేస్ సేల్ నుంచి ఈరోజు గొప్ప సౌండ్ బార్ డీల్ అందించింది. ఈ సేల్ జనవరి 5వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ నుంచి ఈరోజు అందించిన ఈ సౌండ్ బార్ విషయానికి వస్తే, GOVO GOSURROUND 940 సౌండ్ బార్ ను ఈరోజు మంచి డిస్కౌంట్ తో రూ. 8,999 రూపాయల ఆఫర్ ధరకు ఆఫర్ చేస్తోంది.
దీపావళి సేల్ తర్వాత ఈ సౌండ్ బార్ ఇంత తక్కువ ధరకు లిస్ట్ మళ్ళీ ఈ రోజే అయ్యింది. ఈ సౌండ్ బార్ ను flipkart Axis Bank క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి 5% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
Also Read: Moto G05 Launch: బడ్జెట్ ఫోన్ పెద్ద స్క్రీన్ మరియు Dolby Atmos తో లాంచ్ కి సిద్ధం.!
ఈ GOVO 2.1.2 ఛానల్ సౌండ్ బార్ రెండు ఫ్రెంట్ స్పీకర్లు మరియు రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ BASS సౌండ్ అందించే సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 400W పవర్ ఫుల్ సౌండ్ ను అందిస్తుంది. ఈ సౌండ్ బార్ Movie, News, Music మరియు 3D మోడ్ లతో వస్తుంది.
ఈ సౌండ్ బార్ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ మరియు 3D Surround సౌండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ లో HDMI (ARC), AUX, USB, ఆప్టికల్ మరియు Bluetooth V5.3 కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.