New Year Big Deal: బ్రాండెడ్ 500W పవర్ ఫుల్ 5.1 Dolby సౌండ్ బార్ పై బిగ్ డీల్ అందుకోండి.!

Updated on 01-Jan-2025
HIGHLIGHTS

కొత్త సంవత్సరం రోజు ఫ్లిప్ కార్ట్ జబర్దస్త్ సౌండ్ బార్ ఆఫర్ అందించింది

500W సౌండ్ అవుట్ పుట్ అందించే 5.1 Dolby సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్

ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ మరియు సూపర్ డిజైన్ తో వస్తుంది

New Year Big Deal: కొత్త సంవత్సరం రోజు ఫ్లిప్ కార్ట్ జబర్దస్త్ సౌండ్ బార్ ఆఫర్ అందించింది. ఇంటిని షేక్ చేయగల Deep BASS మరియు పవర్ ఫుల్ 500W సౌండ్ అవుట్ పుట్ అందించే 5.1 Dolby సౌండ్ బార్ పై ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ మరియు సూపర్ డిజైన్ తో వస్తుంది.

New Year Big Deal:

కొత్త సంవత్సరం మొదటి రోజే ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ డేస్ సేల్ నుంచి ప్రారంభించింది. ఈ సేల్ నుంచి Boult మూడు నెలల క్రితం లాంచ్ చేసిన పవర్ ఫుల్ సౌండ్ బార్ Bassbox X500 పై ధమాకా ఆఫర్ అందించింది. ఈ సౌండ్ బార్ రూ. 14,999 రూపాయల ధరతో లాంచ్ అయ్యింది మరియు నిన్నటి వరకు కూడా ఇదే ప్రైస్ తో సేల్ అయ్యింది.

అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఈ సౌండ్ బార్ ను రూ. 2,000 భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 12,999 రూపాయల ఆఫర్ ధరకే ఈరోజు సేల్ చేస్తోంది. అంతేకాదు, Flipkart Axis Bank Credit టూ ఈ సౌండ్ బార్ ను కొనుగోలు చేసే వారికి 5% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ను అతితక్కువ EMI ఆప్షన్ తో Debit/ Flipkart EMI ఆఫర్ తో కొనుగోలు చేయవచ్చని ఫ్లిప్ కార్ట్ తెలిపింది.

Also Read: Happy New Year 2025 Wishes: AI తో వాట్సాప్ లో ఇమేజెస్ మరియు గ్రీటింగ్స్ ఇలా పంపండి.!

Bassbox X500 5.1 Dolby సౌండ్ బార్: ఫీచర్స్

ఈ బోల్ట్ సౌండ్ బార్ మూడు ఫుల్ రేంజ్ స్పీకర్లు కలిగిన బార్, రెండు శాటిలైట్ స్పీకర్లు మరియు పవర్ ఫుల్ మరియు డీప్ బాస్ అందించే సబ్ ఉఫర్ ను కలిగి ఉంటుంది. ఈ బోల్ట్ సౌండ్ బార్ టోటల్ 500W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది మరియు Dolby Audio టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

ఈ బోల్ట్ సౌండ్ బార్ వర్చువల్ 3D సౌండ్ స్టేజ్ ఫీచర్ తో థియేటర్ వంటి సౌండ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ DSP ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ సౌండ్ బార్ లో HMDI Arc, USB, ఆప్టికల్, బ్లూటూత్ 5.3 మరియు AUX కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి. ఇది స్టూడియో క్వాలిటీ బాస్ రెస్పాన్స్ తో పాటు 16 బిట్ స్టీరియో ఇంజిన్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :