బ్రాండెడ్ 5.2.2 Dolby Atmos సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ బిగ్ డీల్.!

ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ డేస్ సేల్ బిగ్ సౌండ్ బార్ డీల్ అందించింది
ఈ సేల్ నుంచి బ్రాండెడ్ 5.2.2 Dolby Atmos సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్ అందించింది
ఈ సేల్ ముగియడానికి ఇంకా రెండు రోజులే సమయం ఉంది
ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ డేస్ సేల్ ఏప్రిల్ 6వ తేదీతో ముగుస్తుంది. ఈ సేల్ ముగియడానికి ఇంకా రెండు రోజులే సమయం ఉంది. ఇదంతా ఎందుకు చెబుతున్నారు? అని మీకు డౌట్ రావచ్చు. సరే నేరుగా విషయానికే వస్తున్నా ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఈ సేల్ నుంచి ఈరోజు బిగ్ సౌండ్ బార్ డీల్ అందించింది. ఈ సేల్ నుంచి బ్రాండెడ్ 5.2.2 Dolby Atmos సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ బిగ్ ఈ డీల్ ను అందించింది.
ఏమిటా బ్రాండెడ్ 5.2.2 Dolby Atmos సౌండ్ బార్ డీల్?
ప్రముఖ దేశీయ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ ZEBRONICS ఇటీవల విడుదల చేసిన లేటెస్ట్ 5.2.2 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ ను ఈరోజు 70% భారీ డిస్కౌంట్ తో రూ. 21,999 డిస్కౌంట్ ధరకే ఆఫర్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ ను HDFC డెబిట్, క్రెడిట్ మరియు BOBCARD EMI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి ఈ సౌండ్ బార్ పై రూ. 1,500 రూపాయల అదనపు తగ్గింపు లభిస్తుంది. ఈ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను రూ. 20,499 రూపాయల ఆఫర్ ధరకు అందుకోవచ్చు.
Also Read: Poco C71: 6 వేల సెగ్మెంట్ లో ప్రీమియం డిజైన్ మరియు పెద్ద బ్యాటరీతో లాంచ్ అయ్యింది.!
ZEBRONICS 5.2.2 Dolby Atmos సౌండ్ బార్: ఫీచర్స్
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 5.2.2 సెటప్ తో వస్తుంది. ఇందులో, రెండు అప్ ఫైరింగ్ మరియు మూడు ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు కలిగి ఎం మొత్తం 5 స్పీకర్లతో 305W సౌండ్ అందించే బార్, ఒక్కొక్కటి 110W పవర్ ఫుల్ బాస్ అందించే రెండు సబ్ ఉఫర్లు మరియు రెండు శాటిలైట్ స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 725W జబర్దస్త్ సౌండ్ తో ఇంటిని సైతం షేక్ చేస్తుంది.
ఈ సౌండ్ బార్ బార్ Dolby Atmos సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది మరియు గొప్ప సినిమాటిక్ సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ ప్రత్యేకమైన వైర్లెస్ UHF mic తో కూడా వస్తుంది. ఈ సౌండ్ బార్ లో AUX, ఆప్టికల్, HDMI eArc, USB మరియు బ్లూటూత్ 5.3 వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లు కూడా ఉన్నాయి.