LG ప్రీమియం Soundbar పై ఫ్లిప్ కార్ట్ సేల్ ధమాకా ఆఫర్ ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ ఈరోజు నుంచి ప్రారంభించిన Big Saving Days సేల్ నుంచి ఈ సౌండ్ బార్ డీల్ ను అందించింది. జబర్దస్త్ సౌండ్ అందించే LG యొక్క పవర్ ఫుల్ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఎప్పుడు చూడనంత చవక ధరకే లభిస్తుంది.
ఫ్లిప్ కార్డ్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుంచి ఈరోజు LG యొక్క 3.1.2 ఛానల్ పవర్ ఫుల్ సౌండ్ బార్ పై ఈ డీల్ ని అందించింది. అదేమిటంటే, LG S75Q 3.1.2ch సౌండ్ బార్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ 62% భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ తో ఈ ఎల్ జి సౌండ్ బార్ రూ. 22,990 ఆఫర్ ధరకే సేల్ అవుతోంది.
అంతేకాదు, ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి HDFC Bank Pixel క్రెడిట్ కార్డ్ తో ఈ సౌండ్ బార్ ను కొనుగోలు చేసే వారికి రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను రూ. 20,990 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తుంది. ఈ సౌండ్ లాంచ్ అయిన తర్వాత మొదటిసారిగా ఇంత చవక ధరకు లభిస్తోంది.
Also Read: Flipkart Big Saving Days సేల్ నుంచి 30 వేలకు లభిస్తున్న Samsung 8K కెమెరా ఫోన్.!
ఈ LG సౌండ్ బార్ 3.1.2ch సెటప్ తో వస్తుంది. ఇందులో, 35W సౌండ్ అందించే 2 అప్ ఫైరింగ్ స్పీకర్లు మరియు 30W సౌండ్ అందించే 3 ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు ఉన్నాయి. అలాగే, ఈ సౌండ్ బార్ Deep BASS సౌండ్ అందించే 220W పవర్ ఫుల్ సబ్ ఉఫర్ కూడా ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 380W RMS జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది.
ఈ సౌండ్ బార్ Dolby Vision & HDR10 పాస్ త్రూ, Meridian Audio టెక్నాలజీ మరియు 4K పాస్ త్రూ సపోర్ట్ లతో వస్తుంది. ఈ LG సౌండ్ బార్ Dolby Atmos, DTS-HD Master Audio, DTS:X మరియు Dolby Digital Plus వంటి అన్ని సౌండ్ టెక్నాలజీ ఫార్మాట్ లకు సపోర్ట్ కలిగి ఉంటుంది.