ప్రముఖ జర్మన్ ఆడియో పరికరాల తయారీ కంపెనీ Blaupunkt మరొక కొత్త ప్రోడక్ట్స్ ను విడుదల చేసింది. మునుపెన్నడూ చూడని విధంగా బిల్ట్ ఇన్ బ్యాటరీతో సౌండ్ బార్ విడుదల చేసి ఆశ్చర్యపరిచింది. ఇన్ బిల్ట్ బ్యాటరీతో వచ్చిన మొదటి సౌండ్ బార్ కూడా ఇదే. అదే, Blaupunkt SBA30 వైర్లెస్ బ్లూటూత్ సౌండ్ బార్ మరియు సౌండ్ బార్ 2400 mAh ఇన్ బిల్ట్ బ్యాటరీతో వస్తుంది. మైక్ లేదా గిటార్ కోసం ప్రత్యేకమైన Karoke అప్షన్ ను కోడోత్ ఇందులో అందించడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ కొత్త ఇన్ బిల్ట్ బ్యాటరీ సౌండ్ బార్ ఎలా ఉన్నదో పరిశీలిద్దామా.
Blaupunkt SBA30 సౌండ్ బార్ 2400 mAh ఇన్ బిల్ట్ బ్యాటరీతో వస్తుంది. ఈ సౌండ్ బార్ లో మొత్తం 4 స్పీకర్లు ఉన్నాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 30W సౌండ్ అవుట్ పుట్ ని అందిస్తుంది మరియు స్టీరియో సౌండ్ తో వస్తుంది. ఇక దీని బ్యాటరీ సామర్ధ్యం పరంగా, ఈ సౌండ్ బార్ 14 గంటల వరకూ పనిచేయగలదని కంపెనీ తెలిపింది. కనెక్టివిటీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ Aux, USB, FM రేడియో, TWS ఫంక్షన్ మరియు బ్లూటూత్ 5.0 వంటి మల్టీ కనెక్టివిటీ తో పాటుగా మైక్రో TF కార్డ్ అప్షన్ కూడా వుంది.
ఈ సౌండ్ బార్ బిల్ట్ ఇన్ ఈక్వలైజర్ ను కూడా కలిగి వుంది. ఇందులో, ఆర్డినరీ మ్యూజిక్, రాక్, పాప్, క్లాసికల్ మరియు జాజ్ వంటి 6 మోడ్స్ లు కూడా వున్నాయి. ముఖ్యంగా, SBA30 డేడికేటెడ్ కరోకే మరియు గిటార్ పోర్ట్ లతో వస్తుంది. Blaupunkt SBA30 వైర్లెస్ సౌండ్‌బార్ రూ. 2,699 ధరతో వచ్చింది. ఈ సౌండ్ బార్ Amazon మరియు Blaupunkt యొక్క అధికారిక వెబ్‌సైట్ నుండి సేల్ అవుతోంది.