Dyson OnTrac Headphone: కొత్త టెక్నాలజీతో హెడ్ ఫోన్స్ విడుదల చేసిన డైసన్.!

Dyson OnTrac Headphone: కొత్త టెక్నాలజీతో హెడ్ ఫోన్స్ విడుదల చేసిన డైసన్.!
HIGHLIGHTS

Dyson OnTrac హెడ్ ఫోన్ లను ANC మరియు రియలిస్టిక్ సౌండ్ తో విడుదల చేసింది

సాధారణ హెడ్ ఫోన్స్ మాదిరిగా కాకుండా అటాచబుల్ ట్రావెల్ విజర్ కొత్త టెక్నాలజీ తో విడుదల చేసింది

క్రిస్టల్ BASS, మిడ్ మరియు హై సౌండ్ ల మిళితమైన సౌండ్ అందిస్తుంది

Dyson OnTrac హెడ్ ఫోన్ లను ANC మరియు రియలిస్టిక్ సౌండ్ తో విడుదల చేసింది. ఈ కొత్త హెడ్ ఫోన్ లను సాధారణ హెడ్ ఫోన్స్ మాదిరిగా కాకుండా అటాచబుల్ ట్రావెల్ విజర్ కొత్త టెక్నాలజీ తో విడుదల చేసింది. ఈ హెడ్ ఫోన్ లను కేవలం కంపెనీ అధికారిక సైట్ నుండి మాత్రమే ఆఫర్ చేస్తుంది. అంతేకాదు, హెడ్ ఫోన్ లను 2 ఎక్స్ట్రా ఎలాస్టిక్ కార్బన్ ఫీలర్స్ తో కూడా అందిస్తుంది.

Dyson OnTrac: ఫీచర్స్

డైసన్ ఈ కొత్త హెడ్ ఫోన్ లను కస్టమైజబుల్ ఫీచర్ తో అందించింది. ఈ హెడ్ ఫోన్ లను 2,000 లకు పైగా కలర్స్ క్యాప్ మరియు ఇయర్ కుషన్ కాంబినేషన్ లలో ఎంచుకునేలా అందించింది. ఈ హెడ్ ఫోన్ లో 40mm నియోడైమియం స్పీకర్లతో అందించింది. ఇది 16-ohm స్పీకర్ మరియు క్రిస్టల్ BASS, మిడ్ మరియు హై సౌండ్ ల మిళితమైన సౌండ్ అందిస్తుంది.

Dyson OnTrac Headphone
Dyson OnTrac Headphone

డైసన్ ఈ హెడ్ ఫోన్ లను నోయిస్ క్యాన్సిలేషన్ తో కూడిన ప్యూర్ ఆడియో తో అందించింది. ఇది రియలిస్టిక్ డిటైల్డ్ ఆడియో కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినట్లు కంపెనీ తెలిపింది. ఈ హెడ్ ఫోన్ లో నోయిస్ క్యాన్సిలింగ్ సపోర్ట్ కలిగిన 8 యాక్టివ్ మైక్రో ఫోన్స్ ఉన్నాయి. ఇవి సెకనుకు 3,84,000 సార్లు సరౌండ్ నోయిస్ ను మోనిటర్ చేస్తాయని కంపెనీ తెలిపింది. ఇందులో ఇంటెలిజెంట్ సిగ్నల్ ప్రోసెసింగ్ మరియు యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ మిళితమై రియలిస్టిక్ మరియు డిటైల్డ్ సౌండ్ అందిస్తుంది.

ఇందులో టచ్ మరియు ఆడియో కంట్రోల్ కోసం ప్రత్యేకమైన బటన్ ఉంది. ఈ డైసన్ హెడ్ ఫోన్ 50 గంటల ప్లే టైమ్ అందించే బిగ్ బ్యాటరీ కూడా వుంది. ఈ హెడ్ ఫోన్ నిజమైన క్రిస్టల్ క్లియర్ కాల్స్ ను అందిస్తుంది అని కూడా తెలిపింది. ఈ హెడ్ ఫోన్ తో ట్రావెల్ విజర్ ను యాడ్ చేసుకుని స్వచ్ఛమైన గాలి కూడా ఆస్వాదించవచ్చు. అంటే, ఈ హెడ్ ఫోన్ ప్యూర్ సౌండ్ తో పాటు స్వచ్ఛమైన గాలి కూడా అందించే టెక్ తో వస్తుంది.

Also Read: CMF Phone 1 ఫోన్ కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్.!

Dyson OnTrac: ధర

ఈ హెడ్ ఫోన్స్ ప్రీమియం ధరలో వచ్చిన హెడ్ ఫాన్స్. ఇందులో రెండు హెడ్ ఫోన్స్ ను అందించింది. వీటిలో బేసిక్ వేరియంట్ ను రూ. 59,990 రూపాయలకు మరియు రెండవ వేరియంట్ ను రూ. 64,990 రూపాయలకు అందించింది. ఈ హెడ్ ఫోన్ లను dyson.in నుండి సేల్ కి అందుబాటులోకి తీసుకు వచ్చింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo