Detel సంస్థ ఇండియాలో తన మొట్టమొదటి ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ ను లాంచ్ చేసింది
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మరియు పేటిఎం మాల్ నుండి కొనుగోలు చేయవచ్చు.
డిటెల్ తన సరికొత్త బ్లూటూత్ ఇయర్‌బడ్స్ – డి- ప్యాడ్ ను ప్రారంభించడంతో, ట్రూ వైర్‌లెస్ స్టీరియో ప్రపంచంలోకి ప్రవేశించింది. ఈ ప్రోడక్ట్ ను రూ .2,199 ధరతో అందించింది. దీనిని డిటెల్ యొక్క వెబ్ సైట్, మొబైల్ యాప్ మరియు ప్రధాన e కామర్స్ ప్లాట్ ఫారమ్స్ అయినటువంటి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మరియు పేటిఎం మాల్ నుండి కొనుగోలు చేయవచ్చు.
డిటెల్ ఇయర్ బడ్స్‌లో బ్లూటూత్ వెర్షన్ 5.0+ ఆటో యాడ్ మరియు 10 మీటర్ల వరకు కనెక్టివిటీ పరిధి ఉంటుంది. ఈ ఇయర్ బడ్స్ 300 mAh బ్యాటరీతో మీకు బ్యాకప్ అంధిస్తాయి. దీన్ని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 1-2 గంటలు సమయం పడుతుంది మరియు ఇవి 5 గంటల వరకు ప్లేబ్యాక్ సమయాన్నిఅందిస్తుంది. ఈ ఇయర్ బడ్స్ IPX 4 రేటింగులతో వస్తాయి. అంటే, నీటి తుంపరలు మరియు చెమట నుండి రక్షణను అందిస్తుంది. కాబట్టి, మీ ఫిట్‌నెస్ సమయంలో కూడా చక్కని సంగీతాన్ని వినడానికి ఉపయోగించవచ్చు.
కనెక్టివిటీ ఎంపికల పరంగా, వినియోగదారులు ఎటువంటి అంతరాయం లేని మ్యూజిక్ ఆస్వాదించడానికి ఈ ఇయర్‌బడ్స్‌ను బ్లూటూత్ తో కనెక్ట్ చేయవచ్చు మరియు డ్యూయల్ కాలింగ్ ఫంక్షనాలిటీని కూడా ఉపయోగించవచ్చు. ఈ “మేక్ ఇన్ ఇండియా” వైర్‌లెస్ ఇయర్ బడ్స్ ప్రతి సంగీత ప్రియుల కోసం రూపొందించబడ్డాయి. ఈ వైర్ లెస్ డి పాడ్స్ గూగుల్ అసిస్టెంట్ మరియు సిరి వంటి వర్చువల్ అసిస్టెంట్‌తో ముందే లోడ్ చేయబడ్డాయి.