100 గంటల ప్లే టైమ్ తో విడుదలైన Boult Z40 Ultra ఇయర్ బడ్స్.!

Updated on 06-Mar-2024
HIGHLIGHTS

బోల్ట్ ఇండియాలో కొత్త ఇయర్ బడ్స్ Boult Z40 Ultra ను విడుదల చేసింది

100 గంటల ప్లే టైమ్ తో విడుదల చేయడం విశేషంగా చెప్పవచ్చు

మార్కెట్ లో భారీ పోటీని ఇచ్చేలా ఈ కొత్త బడ్స్ ను బోల్ట్ తీసుకు వచ్చింది

ప్రముఖ భారతీయ వేరబుల్ బ్రాండ్ బోల్ట్ ఇండియాలో కొత్త ఇయర్ బడ్స్ Boult Z40 Ultra ను విడుదల చేసింది. ఈ లేటెస్ట్ ఇయర్ బడ్స్ ను 100 గంటల ప్లే టైమ్ తో విడుదల చేయడం విశేషంగా చెప్పవచ్చు. TWS బడ్స్ మార్కెట్ లో భారీ పోటీని ఇచ్చేలా ఈ కొత్త బడ్స్ ను బోల్ట్ తీసుకు వచ్చింది. బోల్ట్ సరికొత్తగా విడుదల చేసిన ఈ లేటెస్ట్ ట్రూ వైర్లెస్ ఇన్ ఇయర్ బడ్స్ యొక్క స్పెక్స్, ఫీచర్స్ మరియు ధర వివరాలను విపులంగా తెలుసుకుందామా.

Boult Z40 Ultra Price

బోల్ట్ జెడ్ 40 అల్ట్రా ఇయర్ బడ్స్ ను కంపెనీ కేవలం రూ. 1,999 రూపాయల ధరలో విడుదల చేసింది. ఈ కొత్త బడ్స్ ను అమేజాన్ మరియు బోల్ట్ అధికారిక వెబ్సైట్ నుండి సేల్ కి అందుబాటులోకి కూడా వచ్చింది. ఈ బడ్స్ ను అమేజాన్ నుండి కొనడానికి Buy From Here పైన క్లిక్ చెయ్యండి.

Also Read: వివో లేటెస్ట్ కర్వ్డ్ ఫోన్ Vivo V29e 5G పైన భారీ తగ్గింపు.!

Boult Z40 Ultra: ప్రత్యేకతలు

బోల్ట్ తీసుకు వచ్చిన ఈ కొత్త ఇయర్ బడ్స్ బోల్ట్ జెడ్ 40 అల్ట్రా బాక్స్ తో కలిపి 100 Hr ప్లే బ్యాక్ అంధించే సత్తా కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ బడ్స్ 32dB Active Noise Cancellation సపోర్ట్ ను కలిగి వుంది మరియు మంచి కాల్ తో పాటుగా లీనమయ్యే సౌండ్ క్వాలిటీని కూడా అందిస్తుందని బోల్ట్ తెలిపింది.

Boult Z40 Ultra Features

బోల్ట్ అందించిన ఈ కొత్త బడ్స్ 4 క్లియర్ కాలింగ్ మైక్ లను కలిగి కలిగి ఉంటుంది. ఈ బడ్స్ డ్యూయల్ డివైజ్ పెయిరింగ్ మరియు 3 EQ Modes ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు, గేమింగ్ కోసం 45ms లో లెటెన్సీ ఫీచర్ తో తక్కువ జాప్యంతో గొప్ప గేమింగ్ అనుభూతిని కూడా అందించగలదని బోల్ట్ నొక్కి చెప్పింది.

ఈ బోల్ట్ బడ్స్ లో 10mm డ్రైవర్స్ ను కేకలుగి ఉంటుంది. ఈ బోల్డ్ బడ్స్ బ్లాక్ గ్లాస్ ఫినిష్, బీజీ రబ్బర్ ఫినిష్ మరియు మెటాలిక్ బ్రెష్డ్ మెటల్ ఫినిష్ అనే మూడు అందమైన కలర్ ఆప్షన్ లలో ఈ బడ్స్ ను బోల్ట్ అందించింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :