boAt Upcoming Buds: 45 గంటల ప్లేటైమ్ తో కొత్త బడ్స్ లాంచ్ చేస్తున్న బోట్.!

boAt Upcoming Buds: 45 గంటల ప్లేటైమ్ తో కొత్త బడ్స్ లాంచ్ చేస్తున్న బోట్.!
HIGHLIGHTS

40 గంటల ప్లే టైమ్ తో కొత్త బడ్స్ లాంచ్ చేస్తున్న Boat

అప్ కమింగ్ బడ్స్ ను AirDopes 91 పేరుతో తీసుకు వస్తోంది

లాంఛ్ ప్రైస్ తో కూడా టీజింగ్ ను బోట్ మొదలుపెట్టింది

boAt Upcoming Buds: ప్రముఖ ఇండియన్ ఆడియో ప్రోడక్ట్స్ బ్రాండ్ బోట్, 40 గంటల ప్లే టైమ్ తో కొత్త బడ్స్ లాంచ్ చేస్తున్న అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ బడ్స్ ను AirDopes 91 పేరుతో తీసుకు వస్తోంది మరియు ఈ ఈ బడ్స్ కలిగి ఉండనున్న ఫీచర్స్ మరియు లాంఛ్ ప్రైస్ తో కూడా టీజింగ్ ను బోట్ మొదలుపెట్టింది. బోట్ లాంచ్ చేయనున్న ఈ ఇయర్ బడ్స్ స్పెక్స్, ఫీచర్లు మరియు ప్రైస్ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

boAt Upcoming Buds

బోట్ అప్ కమింగ్ TWS ఇయర్ బడ్స్ AirDopes 91 ను ఫిబ్రవరి 1వ తేది మధ్యాహ్నం 12 గంటలకి మార్కెట్ లో లాంచ్ చేయనున్నట్లు డేట్ అనౌన్స్ చేసింది. ఈ ఇయర్ బడ్స్ ను కేవలం రూ. 999 రూపాయల లాంచ్ ధరతో ప్రకటించనట్లు కూడా టీజింగ్ మొదలు పెట్టింది. ఈ ఇయర్ బడ్స్ ను అమేజాన్ సేల్ పార్ట్నర్ గా అందిస్తోంది.

అందుకే, ఎయిర్ డోప్స్ 91 లాంచ్ గురించి ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ తో టీజింగ్ చేస్తోంది అమేజాన్ ఇండియా. ఈ పేజ్ నుండి ఈ బోట్ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ యొక్క స్పెక్స్ మరియు ఫీచర్స్ ను కూడా ముందే వెల్లడించింది.

Also Read : WhatsApp: ఫైల్ షేరింగ్ కోసం అద్భుతమైన కొత్త ఫీచర్ తెచ్చిన వాట్సాప్.!

బోట్ AirDopes 91 ప్రత్యేకతలు

బోట్ ఎయిర్ డోప్స్ 91 ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ టోటల్ 45 గంటల ప్లేటైమ్ అందించగల బ్యాటరీతో లాంచ్ చేయనున్నట్లు టీజింగ్ ద్వారా తెలియ చేసింది. ఈ బడ్స్ లో బోట్ సిగ్నేచర్ సౌండ్ అందించ గల 10mm స్పీకర్లు ఉన్నాయి. మంచి క్వాలిటీ మరియు క్లియర్ కాలింగ్ సౌలభ్యం కోసం ఈ బడ్స్ లో Dual Mic ENx ఉన్నట్లు కొద బోట్ తెలిపింది.

ఎటువంటి జాప్యం లేకుండా లీనమైన గేమింగ్ ఎక్స్ పీరియన్స్ అందించే 50ms Beast Mode ఈ బడ్స్ లో ఉన్నట్లు టీజింగ్ నుండి గొప్పగా చెబుతోంది. ఈ బడ్స్ ను చాలా వేగంగా ఛార్జ్ చెయ్యగల ASAP Charge టెక్ ను కూడా ఈ బడ్స్ లో అందించినాట్లు చెబుతోంది. ఈ బడ్స్ కొత్త డిజైన్ తో మూడు అందమైన కలర్స్ తో లాంచ్ అవుతోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo