boAt Nirvana Crystal with 100 hours play time and 32db anc launched
boAt Nirvana Crystal: ప్రముఖ భారతీయ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ బోట్ ఈరోజు గొప్ప బడ్స్ లాంచ్ చేసింది. ఈ బడ్స్ ను 100 గంటల ప్లే టైం మరియు 32dB ANC వంటి ఫీచర్స్ తో చవక ధరలో లాంచ్ చేసింది. నిర్వాణ సిరీస్ నుంచి రీసెంట్ గా నిర్వాణ X TWS బడ్స్ లాంచ్ చేసిన బోట్, ఈరోజు ఈ కొత్త నిర్వాణ క్రిస్టల్ బడ్స్ లాంచ్ చేసింది.
బోట్ నిర్వాణ క్రిస్టల్ బడ్స్ ను రూ. 2,499 రూపాయల స్పెషల్ ప్రైస్ తో లాంచ్ చేసింది. ఈ ఇయర్ బడ్స్ మార్చి 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ బడ్స్ అమెజాన్ ఇండియా మరియు బోట్ అధికారిక సైట్ నుంచి లభిస్తుంది.
Also Read: Realme Buds Air 7: 52dB ANC మరియు LHDC సపోర్ట్ తో కొత్త బడ్స్ లాంచ్ చేసిన రియల్ మీ.!
బోట్ నిర్వాణ క్రిస్టల్ బడ్స్ లాంగ్ బ్యాటరీ లైఫ్ తో వస్తుంది. ఈ బడ్స్ ఏకంగా 100 గంటల ప్లే టైం అందిస్తుందని బోట్ తెలిపింది. ఈ కొత్త బడ్స్ లోపలి భాగాలు కూడా కనిపించేలా ట్రాన్స్పరెంట్ బాక్స్ మరియు గొప్ప డిజైన్ తో తో వస్తుంది. ఈ బోట్ బడ్స్ బోట్ సిగ్నేచర్ సౌండ్ తో వస్తుంది మరియు బోట్ హియరబుల్ యాప్ సపోర్ట్ తో కూడా వస్తుంది.
ఈ బడ్స్ ను బోట్ స్పెటియల్ సౌండ్ ఫీచర్ మరియు 32 dB యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్ కూడా వస్తుంది. ఈ బడ్స్ ఇన్ ఇయర్ డిటెక్షన్ మరియు మల్టీ పాయింట్ కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ బోట్ బడ్స్ మంచి కాలింగ్ కోసం మైక్ ENx టెక్నాలజీ తో కూడా వస్తుంది. బోట్ నిర్వాణ క్రిస్టల్ IPX4 వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ బడ్స్ బ్లాక్, ఎల్లో మరియు రెడ్ మూడు కలర్స్ లో లభిస్తుంది.