boAt Nirvana Crystal: 100 గంటల ప్లే టైం మరియు 32dB ANC తో బడ్జెట్ ధరలో వచ్చింది.!

బోట్ ఈరోజు గొప్ప బడ్స్ లాంచ్ చేసింది
boAt Nirvana Crystal బడ్స్ ను 100 గంటల ప్లే టైం మరియు 32dB ANC వంటి ఫీచర్స్ తో లాంచ్ చేసింది
బోట్ నిర్వాణ క్రిస్టల్ బడ్స్ ను రూ. 2,499 రూపాయల స్పెషల్ ప్రైస్ తో లాంచ్ చేసింది
boAt Nirvana Crystal: ప్రముఖ భారతీయ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ బోట్ ఈరోజు గొప్ప బడ్స్ లాంచ్ చేసింది. ఈ బడ్స్ ను 100 గంటల ప్లే టైం మరియు 32dB ANC వంటి ఫీచర్స్ తో చవక ధరలో లాంచ్ చేసింది. నిర్వాణ సిరీస్ నుంచి రీసెంట్ గా నిర్వాణ X TWS బడ్స్ లాంచ్ చేసిన బోట్, ఈరోజు ఈ కొత్త నిర్వాణ క్రిస్టల్ బడ్స్ లాంచ్ చేసింది.
boAt Nirvana Crystal: ప్రైస్
బోట్ నిర్వాణ క్రిస్టల్ బడ్స్ ను రూ. 2,499 రూపాయల స్పెషల్ ప్రైస్ తో లాంచ్ చేసింది. ఈ ఇయర్ బడ్స్ మార్చి 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ బడ్స్ అమెజాన్ ఇండియా మరియు బోట్ అధికారిక సైట్ నుంచి లభిస్తుంది.
Also Read: Realme Buds Air 7: 52dB ANC మరియు LHDC సపోర్ట్ తో కొత్త బడ్స్ లాంచ్ చేసిన రియల్ మీ.!
boAt Nirvana Crystal: ఫీచర్స్
బోట్ నిర్వాణ క్రిస్టల్ బడ్స్ లాంగ్ బ్యాటరీ లైఫ్ తో వస్తుంది. ఈ బడ్స్ ఏకంగా 100 గంటల ప్లే టైం అందిస్తుందని బోట్ తెలిపింది. ఈ కొత్త బడ్స్ లోపలి భాగాలు కూడా కనిపించేలా ట్రాన్స్పరెంట్ బాక్స్ మరియు గొప్ప డిజైన్ తో తో వస్తుంది. ఈ బోట్ బడ్స్ బోట్ సిగ్నేచర్ సౌండ్ తో వస్తుంది మరియు బోట్ హియరబుల్ యాప్ సపోర్ట్ తో కూడా వస్తుంది.
ఈ బడ్స్ ను బోట్ స్పెటియల్ సౌండ్ ఫీచర్ మరియు 32 dB యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్ కూడా వస్తుంది. ఈ బడ్స్ ఇన్ ఇయర్ డిటెక్షన్ మరియు మల్టీ పాయింట్ కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ బోట్ బడ్స్ మంచి కాలింగ్ కోసం మైక్ ENx టెక్నాలజీ తో కూడా వస్తుంది. బోట్ నిర్వాణ క్రిస్టల్ IPX4 వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ బడ్స్ బ్లాక్, ఎల్లో మరియు రెడ్ మూడు కలర్స్ లో లభిస్తుంది.