boAt Airdopes 111: 28 గంటల ప్లే బ్యాక్ తో వచ్చిన బోట్ TWS బడ్స్

boAt Airdopes 111: 28 గంటల ప్లే బ్యాక్ తో వచ్చిన బోట్ TWS బడ్స్
HIGHLIGHTS

boAt తన కొత్త ప్రోడక్ట్ Airdopes 11 TWS బడ్స్ ని ఆవిష్కరించింది

ఈ TWS ఇయర్ బడ్స్ 13mm డ్రైవర్స్ తో వస్తుంది

బ్లూటూత్ 5.1 కనక్టివిటీ వంటి లేటెస్ట్ ఫీచర్లను కలిగి వుంది

ప్రముఖ ఆడియో పరికరాల తయారీ కంపెనీ boAt తన కొత్త ప్రోడక్ట్ Airdopes 11  ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ ని ఆవిష్కరించింది. ఈ TWS ఇయర్ బడ్స్ 13mm డ్రైవర్స్ , బ్లూటూత్ 5.1 కనక్టివిటీ వంటి లేటెస్ట్ ఫీచర్లను కలిగి వుంది. బోట్ కొత్త మార్కెట్లో ప్రకటించిన ఈ Airdopes 11 ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ ధర మరియు ఫీచర్ల గురించి తెలుసుకుందాం.                

boAt Airdopes 111: ఫీచర్లు            

boAt Airdopes 111: త్రు వైర్లెస్ ఇయర్ బడ్స్ 13mm డ్రైవర్స్ తో రిచ్ బాస్ మరియు క్లియర్ సౌండ్ అందిస్తుంది. ఇందులో అందించిన  ASAP ఛార్జింగ్ టెక్నాలజీతో కేవలం 5 నిముషాల ఛార్జింగ్ తో 45 నిముషాలు ఆనందించవచ్చని కంపెనీ తెలిపింది. అలాగే, ఈ బడ్స్ ఒక్కసారి పూర్తి  ఛార్జింగ్ తో 7 గంటల ప్లే బ్యాక్ మరియు బాక్స్ తో 21 గంటల ప్లే బ్యాక్ ను కలిపి మొత్తం 28 గంటల ప్లే బ్యాక్ సమయాన్ని అందిస్తుంది. అలాగే, ఇందులో క్విక్ రెస్పాన్స్ టచ్ కాంట్రొల్స్ మరియు వన్ టచ్ వాయిస్ అసిస్టెంట్ వంటి ఫీచర్లను కూడా అందించింది. ఇది Bluetooth 5.1 కనెక్టివిటీ తో వస్తుంది.   

boAt Airdopes 111: ధర

boAt ఈ Airdopes 111 ని రూ.1,499 రూపాయల ధరతో ప్రకటించింది. ఈ ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ బోట్ అధికారిక వెబ్సైట్, Flipkart మరియు Amazon లలో లభిస్తుంది. Airdopes 111 బడ్స్ ఓషియన్ బ్లూ, శాండ్ పెర్ల్, కార్బన్ బ్లాక్ మరియు స్నో వైట్ వంటి నాలుగు కలర్ అప్షన్ లలో లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo