“ENC CRISPR” టెక్నాలజీతో కొత్త TWS బడ్స్ లాంచ్ చేసిన బ్లూపంక్ట్.!
ప్రముఖ జర్మన్ ఆడియో ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ Blaupunkt భారతదేశంలో కొత్త TWS ఇయర్ బడ్ లను లాంచ్ చేసింది. ఈ ట్రూవైర్లెస్ బడ్స్ ను "ENC CRISPR" టెక్నాలజీతో ప్రకటించింది. ఈ టెక్నాలజీ సహాయంతో కాల్ మాట్లాడే సమయంలో పరిసర శబ్దాలను ఫిల్టర్ చేసి కేవలం హ్యూమన్ వాయిస్ ను మాత్రమే స్వీకరిస్తుంది. అంటే క్లియర్ గా చెప్పాలంటే, మీరు కాల్ మాట్లాడేటప్పుడు కేవలం మీ మాటలను మాత్రమే స్వీకరించి, ఇతర రణగోణ ధ్వనులను వదిలేస్తుంది.
బ్లూపంక్ట్ తీసుకొచ్చిన ఈ లేటెస్ట్ ఇయర్ బడ్‌లు ఫీచర్లతో నిండివున్నా కూడా బడ్జెట్‌కు అనుకూలమైనవి. అంతేకాదు, గొప్ప జర్మన్ నాణ్యత మరియు సాంకేతికతను కలిగి ఉంటాయి. ఈ TWS ఇయర్ బడ్స్ స్టెమ్ డిజైన్‌తో వస్తాయి మరియు ఓవెల్ ఆకారపు ఛార్జింగ్ కేస్ లోపల ఛార్జ్ అవుతాయి.
ఇక ఈ కొత్త ట్రూవైర్లెస్ బడ్స్ ఫీచర్ల విషయానికి వస్తే, ఇవి 10mm స్పీకర్లతో క్రిస్టల్ క్లియర్ సౌండ్ తో పాటు పంచ్ బాస్‌ను ఉత్పత్తి చేయగలవు. ఈ స్పీకర్లు స్టీరియో హై డెఫినేషన్ సౌండ్ అందించగలవని కంపెనీ తెలిపింది. ఇక కనెక్టివిటీ పరంగా, ఈ ఇయర్ బడ్స్ బ్లూటూత్ 5.1 తో వస్తాయి మరియు ఇది సిగ్నల్ నష్టం లేదా మైక్ డ్రాప్ అవుట్ లేకుండా గరిష్టంగా 30 అడుగుల పరిధి వరకూ పనిచేస్తుంది. అధనంగా, ఈ ఇయర్ బడ్స్ గేమింగ్ కోసం 80ms తక్కువ లేటెన్సీ మోడ్‌ను కూడా కలిగి ఉంటాయి.
ఈ TWS ఇయర్ బడ్స్ కేస్ 400mAh బ్యాటరీతో మరియు టర్బో వోల్ట్ ఛార్జింగ్ ఫీచర్ తో కూడా వస్తుంది. ఇది కేవలం 15 నిముషాల ఛార్జింగ్ తో 1 గంట ప్లే బ్యాక్ ని అందిస్తుందని బ్లూపంక్ట్ తెలిపింది. Blaupunkt BTW100 TWS ఇయర్ బడ్స్ రూ. 2,999 ధరతో ప్రకటించబడింది మరియు అమెజాన్ నుండి అందుబాటులో ఉన్నాయి.