భారీ 600W సౌండ్ తో 5.1 Dolby Audio సౌండ్ బార్ లాంచ్.!

Updated on 22-Aug-2022
HIGHLIGHTS

600W సౌండ్ తో 5.1 Dolby Audio సౌండ్ బార్ లాంచ్

బ్లూపంక్ట్ SBW600 5.1 సౌండ్ బార్ మరియు శాటిలైట్ స్పీకర్లను కలిగి ఉంటుంది

360 డిగ్రీల సౌండ్ సెపరేషన్‌తో అత్యధిక స్పష్టతతో సౌండ్ అందిస్తుంది

ఆడియో పరికరాలను అందించడంలో గొప్ప పేరు కలిగిన ప్రముఖ జర్మన్ బ్రాండ్ Blaupunkt ఇండియాలో కొత్త భారీ 600W సౌండ్ తో 5.1 Dolby Audio సౌండ్ బార్ లాంచ్ చేసింది. బ్లూపంక్ట్ SBW600 5.1 పేరుతో తీసుకువచ్చిన ఈ సౌండ్ బార్ 600W హెవీ సౌండ్ అందించగలదు. హెవీ సౌండ్ తో పాటుగా లీనమయ్యే పవర్ ఫుల్ ఆడియో పెర్ఫార్మెన్స్ ఈ సౌండ్ బార్ ప్రత్యేకత అని కంపెనీ చెబుతోంది. 360 డిగ్రీల సౌండ్ సెపరేషన్‌తో అత్యధిక స్పష్టత మరియు బ్యాలెన్స్‌ సౌండ్ అందించడం కోసం ఈ సౌండ్ బార్ లో Dolby Audio సౌండ్ టెక్నాలజీ జత చెయ్యబడిందిని కూడా కంపెనీ పేర్కొంది. మరి ఈ లేటెస్ట్ సౌండ్ బార్ ధర మరియు ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందామా.

Blaupunkt SBW600 5.1 సౌండ్ బార్ సెపరేట్ సబ్ ఉఫర్, సౌండ్ బార్ మరియు శాటిలైట్ స్పీకర్లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ మొత్తం 11 స్పీకర్లను కలిగి ఉంటుంది. వీటిలో, 1 స్పీకర్ 8 ఇంచ్ పెద్ద హెవీ ఉఫర్ కాగా, మిగిలిన 10 స్పీకర్లు కూడా 2.5 ఇంచ్ స్పీకర్లు. సౌండ్ బార్ 6 స్పీకర్లను కలిగి ఉండగా, శాటిలైట్ స్పీకర్ లు ఒక్కొక్కదానిలో 2 చొప్పున మొత్తం 4 స్పీకర్లను కలిగి ఉంటాయి. సబ్ ఉఫర్ లో వున్న పెద్ద స్పీకర్ డౌన్ ఫైరింగ్ స్పీకర్ మరియు మంచి రిచ్ మరియు పవర్ ఫుల్ Bass అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

Blaupunkt SBW600 వైర్‌లెస్ సౌండ్‌బార్ రూ.18,990 ధరతో ఇండియాలో లాంచ్ చెయ్యబడింది. ఈ సౌండ్ బార్ Amazon మరియు Blaupunkt యొక్క స్వంత వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఇక ఈ సౌండ్ బార్ కనెక్టివిటీ విషయానికి వస్తే, SBW600 సౌండ్ బార్ లేటెస్ట్ బ్లూటూత్, HDMI మరియు ARC ఇంటర్‌ ఫేస్‌ లతో పాటుగా AUX, USB, Optical మరియు Coaxial పోర్ట్‌లతో సహా మల్టి పుల్ కనెక్టివిటీ అప్షన్లకు సపోర్ట్ కలివుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :