జర్మన్ ఆడియో ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ Blaupunkt సరికొత్త సౌండ్ బార్ ను ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇన్ బిల్ట్ బ్యాటరీతో వచ్చిన మొట్టమొదటి సౌండ్ బార్ కూడా ఇదే అవుతుంది. Blaupunkt SBA30 వైర్లెస్ బ్లూటూత్ సౌండ్ బార్ పేరుతో తీసుకొచ్చిన ఈ సౌండ్ బార్ 2400 mAh ఇన్ బిల్ట్ బ్యాటరీతో వస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ మైక్ లేదా గిటార్ కోసం ప్రత్యేకమైన Karoke తో వస్తుంది. బ్లూపంక్ట్, ఈ సౌండ్ బార్ ను కేవలం బడ్జెట్ ధరలోనే విడుదల చేసింది. ఈ కొత్త ఇన్ బిల్ట్ బ్యాటరీ సౌండ్ బార్ ప్రత్యేకతలు ఏమిటో వివరంగా చూద్దాం పదండి.
Blaupunkt SBA30 సౌండ్ బార్ 2400 mAh ఇన్ బిల్ట్ బ్యాటరీతో వస్తుంది. ఈ సౌండ్ బార్ లో మొత్తం 4 స్పీకర్లు ఉన్నాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 30W సౌండ్ అవుట్ పుట్ ని అందిస్తుంది మరియు స్టీరియో సౌండ్ తో వస్తుంది. ఇక దీని బ్యాటరీ సామర్ధ్యం పరంగా, ఈ సౌండ్ బార్ 14 గంటల వరకూ పనిచేయగలదని కంపెనీ తెలిపింది. కనెక్టివిటీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ Aux, USB, FM రేడియో, TWS ఫంక్షన్ మరియు బ్లూటూత్ 5.0 వంటి మల్టీ కనెక్టివిటీ తో పాటుగా మైక్రో TF కార్డ్ అప్షన్ కూడా వుంది.
ఈ సౌండ్ బార్ బిల్ట్ ఇన్ ఈక్వలైజర్ ను కూడా కలిగి వుంది. ఇందులో, ఆర్డినరీ మ్యూజిక్, రాక్, పాప్, క్లాసికల్ మరియు జాజ్ వంటి 6 మోడ్స్ లు కూడా వున్నాయి. ముఖ్యంగా, SBA30 డేడికేటెడ్ కరోకే మరియు గిటార్ పోర్ట్ లతో వస్తుంది. Blaupunkt SBA30 వైర్లెస్ సౌండ్‌బార్ రూ. 2,699 ధరతో వచ్చింది. ఈ సౌండ్ బార్ Amazon మరియు Blaupunkt యొక్క అధికారిక వెబ్‌సైట్ నుండి సేల్ అవుతోంది.