Blaupunkt: ఇన్ బిల్ట్ బ్యాటరీతో ఫస్ట్ సౌండ్ బార్ లాంచ్ చేసింది
laupunkt సరికొత్త సౌండ్ బార్ ను ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది
ఇన్ బిల్ట్ బ్యాటరీతో వచ్చిన మొట్టమొదటి సౌండ్ బార్
Blaupunkt SBA30 సౌండ్ బార్ 2400 mAh ఇన్ బిల్ట్ బ్యాటరీతో వస్తుంది
జర్మన్ ఆడియో ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ Blaupunkt సరికొత్త సౌండ్ బార్ ను ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇన్ బిల్ట్ బ్యాటరీతో వచ్చిన మొట్టమొదటి సౌండ్ బార్ కూడా ఇదే అవుతుంది. Blaupunkt SBA30 వైర్లెస్ బ్లూటూత్ సౌండ్ బార్ పేరుతో తీసుకొచ్చిన ఈ సౌండ్ బార్ 2400 mAh ఇన్ బిల్ట్ బ్యాటరీతో వస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ మైక్ లేదా గిటార్ కోసం ప్రత్యేకమైన Karoke తో వస్తుంది. బ్లూపంక్ట్, ఈ సౌండ్ బార్ ను కేవలం బడ్జెట్ ధరలోనే విడుదల చేసింది. ఈ కొత్త ఇన్ బిల్ట్ బ్యాటరీ సౌండ్ బార్ ప్రత్యేకతలు ఏమిటో వివరంగా చూద్దాం పదండి.
Blaupunkt SBA30:
Blaupunkt SBA30 సౌండ్ బార్ 2400 mAh ఇన్ బిల్ట్ బ్యాటరీతో వస్తుంది. ఈ సౌండ్ బార్ లో మొత్తం 4 స్పీకర్లు ఉన్నాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 30W సౌండ్ అవుట్ పుట్ ని అందిస్తుంది మరియు స్టీరియో సౌండ్ తో వస్తుంది. ఇక దీని బ్యాటరీ సామర్ధ్యం పరంగా, ఈ సౌండ్ బార్ 14 గంటల వరకూ పనిచేయగలదని కంపెనీ తెలిపింది. కనెక్టివిటీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ Aux, USB, FM రేడియో, TWS ఫంక్షన్ మరియు బ్లూటూత్ 5.0 వంటి మల్టీ కనెక్టివిటీ తో పాటుగా మైక్రో TF కార్డ్ అప్షన్ కూడా వుంది.
ఈ సౌండ్ బార్ బిల్ట్ ఇన్ ఈక్వలైజర్ ను కూడా కలిగి వుంది. ఇందులో, ఆర్డినరీ మ్యూజిక్, రాక్, పాప్, క్లాసికల్ మరియు జాజ్ వంటి 6 మోడ్స్ లు కూడా వున్నాయి. ముఖ్యంగా, SBA30 డేడికేటెడ్ కరోకే మరియు గిటార్ పోర్ట్ లతో వస్తుంది. Blaupunkt SBA30 వైర్లెస్ సౌండ్‌బార్ రూ. 2,699 ధరతో వచ్చింది. ఈ సౌండ్ బార్ Amazon మరియు Blaupunkt యొక్క అధికారిక వెబ్‌సైట్ నుండి సేల్ అవుతోంది.