ఇండియాలో సరికొత్తగా ఈక్వలైజెర్ బటన్ తో బ్లూటూత్ హెడ్ ఫోన్ తీసుకొచ్చిన జర్మన్ కంపెనీ Blaupunkt

Updated on 06-May-2019
HIGHLIGHTS

ఈ BH01 బ్లూటూత్ హెడ్ ఫోన్ లేటెస్ట్ బ్లూటూత్ వర్షన్ అయినటువంటి, 5.0 సపోర్టుతో అందించారు.

ఇవి 40MM పరిమానంతో గొప్ప బాస్ తో కూడిన సౌండ్ అందించే సామర్ధ్యాన్ని కలిగివుంటాయి.

ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ను కేవలం రూ. 1,699 ధరతో విడుదల చేసింది.

జర్మన్ లో అతిపెద్ద ఆడియో ప్రోడక్ట్స్ తయారుదారు సంస్థ అయిన Blaupunkt, భారత దేశంలో సరికొత్తగా ఈక్వలైజెర్ బటన్ కలిగిన ఒక బ్లూటూత్ హెడ్ ఫోన్ను ఈరోజు విడుదల చేసింది. BH01 పేరుతొ ఇండియాలో విడుదల చేసిన ఈ BT హెడ్ ఫోన్, బెస్ట్ ఇన్ క్లాస్ డిజైన్ మరియు పనితనంతో ఉండనున్నట్లు సంస్థ చెబుతోంది. ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ను కేవలం రూ. 1,699 ధరతో విడుదల చేసింది. ఈ హెడ్ ఫోన్ ప్రస్తుతం అమేజాన్ ఇండియా ద్వారా రూ. 1,299 అఫర్ ధరతో అమ్ముడవుతోంది, ఈ రోజు రాత్రి 11 గంటల వరకు ఈ అఫర్ అందుబాటులో ఉంటుంది.  ఈ( LINK ) పైన క్లిక్ చేసి నేరుగా కొనవచ్చు    

BH01 బ్లూటూత్ హెడ్ ఫోన్ ప్రత్యేకతలు

ఈ BH01 బ్లూటూత్ హెడ్ ఫోన్ లేటెస్ట్ బ్లూటూత్ వర్షన్ అయినటువంటి, 5.0 సపోర్టుతో అందించారు. ఈ స్పీకర్ల పరిమాణం చూసినట్లయితే, ఇవి 40MM పరిమానంతో గొప్ప బాస్ తో కూడిన సౌండ్ అందించే సామర్ధ్యాన్ని కలిగివుంటాయి. ఇక ఫ్రీక్వెన్సీ విషయానికి వస్తే, ఇది 20hz నుండి 20khz గా ఉంటుంది, అంటే అతిచిన్న సౌండ్స్ కూడా మనకు చక్కగా వినిపిస్తాయి.

అధనంగా, ఇందులో అందించిన కంట్రోల్ బటన్లతో  Play / Pause / Track Change / Call Pick మరియు Drop వంటివి షాల్ సులభంగా చేసుకోవచ్చు. అలాగే, ఇందులో అందించిన 300mAh బ్యాటరీ కారణంగా 10 గంటల వరకూ కూడా ఎటువంటి అంతరాయం లేకుండా చక్కగా మ్యూజిక్ ని ఆస్వాదించవచ్చు. ప్రధానంగా, ఇందులో అందించిన Bass Boost Button తో హెవీ Bass తో మ్యూజిక్ ని ఎంజాయ్ చేసే అవకాశం మీకు అందుతుంది. దీనితో, మీకు నచ్చినట్లుగా సౌండ్ సెట్టింగును (ఎక్వలైజర్ ) చేసుకునేలా అవకాశం ఉంటుంది.                             

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :