ఇంటిని షేక్ చేసే LG 600W పవర్ ఫుల్ Dolby Soundbar పై బిగ్ డీల్.!

Updated on 17-Dec-2024
HIGHLIGHTS

సౌండ్ బార్ కోసం సెర్చ్ చేస్తున్న వారికి ఈరోజు గొప్ప సౌండ్ బార్ ఆఫర్ అందుబాటులో ఉంది

LG యొక్క 600W పవర్ ఫుల్ Dolby Soundbar ఈరోజు మంచి ఆఫర్ ధరకే లభిస్తోంది

ఈ LG సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు వైర్లెస్ శాటిలైట్ స్పీకర్లను కలిగి ఉంటుంది

ఇంటిని షేక్ చేసే పవర్ ఫుల్ సౌండ్ బార్ కోసం సెర్చ్ చేస్తున్న వారికి ఈరోజు గొప్ప సౌండ్ బార్ ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రపంచ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం LG యొక్క 600W పవర్ ఫుల్ Dolby Soundbar ఈరోజు మంచి ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ LG సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు వైర్లెస్ శాటిలైట్ స్పీకర్లను కలిగి ఉంటుంది. ఈరోజు గొప్ప డిస్కౌంట్ దొరికే లభిస్తున్న ఈ సౌండ్ బార్ ఆఫర్ వివరాలు చూద్దాం.

LG 600W Dolby Soundbar Deal

ఇండియాలో ఇటీవల విడుదలైన LG Sound Bar S65Tr సౌండ్ బార్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈరోజు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ అమెజాన్ ఇండియా నుండి ఈరోజు గోప డిస్కౌంట్ తో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ రూ. 37,990 రూపాయల లాంచ్ అవ్వగా, ఈరోజు అమెజాన్ నుంచి 34% భారీ డిస్కౌంట్ తో రూ. 24,990 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది.

ఈ సౌండ్ బార్ ను DBS, BOBCARD మరియు Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ LG సౌండ్ బార్ ను రూ. 23,490 ఆఫర్ ధరకు అందుకోవచ్చు. Buy From Here

LG 600W Dolby Soundbar : ఫీచర్స్

ఈ LG సౌండ్ బార్ మూడు స్పీకర్లు కలిగిన పవర్ ఫుల్ బార్, రెండు వైర్లెస్ శాటిలైట్ స్పీకర్స్ మరియు హెవీ BASS అందించగల పవర్ ఫుల్ వైర్లెస్ సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ LG సౌండ్ బార్ టోటల్ 600W RMS సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇది Bass Blast మరియు Bass Blast + ఫీచర్ తో ఇంటిని షేక్ చేసే హెవీ BASS అందిస్తుంది.

ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సౌండ్ బార్ మరియు వైర్లెస్ సపోర్ట్ తో గొప్ప సెటప్ కు అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ AI Sound Pro సపోర్ట్ తో సౌండ్ సర్దుబాటు చేసుకుంటుంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ Dolby Digital మరియు DTS Digital Surround సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ లతో సినిమా హాల్ వంటి అనుభూతిని ఇంట్లోనే అందిస్తుంది.

Also Read: Sony 5.1 Dolby Soundbar ఈరోజు అమెజాన్ నుంచి మంచి డిస్కౌంట్ ధరాకే లభిస్తోంది.!

ఈ LG సౌండ్ బార్ కనెక్టివిటీ పరంగా, HDMI Audio Return Channel (ARC), CEC (Simplink), ఆప్టికల్ మరియు బ్లూటూత్ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :