best projectors under 10k to watch IPL 2025 Match
IPL 2025 Match లు మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మ్యాచ్ లను పెద్ద స్క్రీన్ లో చూస్తే వచ్చే ఆ కిక్కే వేరబ్బా అని అనుకునే వారిలో మీరు ఉన్నారా? అయితే, మీకు స్మార్ట్ టీవీల కంటే Smart Projector లు ఉత్తమంగా ఉంటాయి. అందుకే, ఒక స్మార్ట్ టీవీ కంటే తక్కువ బడ్జెట్ లో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ ప్రొజెక్టర్ డీల్స్ వివరాలు ఈ రోజు అందిస్తున్నాను.
ఐపీఎల్ మ్యాచ్ లు మార్చి 22వ తేదీ సాయంత్రం 7 గంటలకు మొదలయ్యే KKR vs RCB మొదటి మ్యాచ్ తో స్టార్ట్ అవుతాయి. మొత్తం 74 మ్యాచ్ లు జరుగుతాయి మరియు ఈ సీజన్ 25 మే 2025 తో ముగుస్తుంది. ఈ మ్యాచ్ లు స్టార్ స్పోర్ట్స్ లో లైవ్ కార్యక్రమం ప్రసారం చేయబడతాయి. జియో సినిమా మరియు జియో హాట్ స్టార్ లో ఐపీఎల్ మ్యాచ్ లైవ్ స్ట్రీమ్ అవుతుంది.
ఒకప్పుడు చాలా ప్రీమియం సెగ్మెంట్ లో మాత్రమే లభించిన స్మార్ట్ ప్రొజెక్టర్స్ ఇప్పుడు బడ్జెట్ ధరలో కూడా లభిస్తున్నాయి. అటువంటి వాటిలో కేవలం 10 వేల కంటే తక్కువ ధరలో లభించే బెస్ట్ స్మార్ట్ ప్రొజెక్టర్ డీల్స్ ఇక్కడ అందిస్తున్నాను.
జెబ్రోనిక్స్ యొక్క ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 63% డిస్కౌంట్ తో రూ. 7,999 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తోంది. ఈ ప్రొజెక్టర్ పై SBI క్రెడిట్ కార్డ్ రూ. 799 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ప్రొజెక్టర్ రూ . 7,200 ధరకే లభిస్తుంది. ఈ ప్రొజెక్టర్ FHD రిజల్యూషన్ తో వస్తుంది మరియు గరిష్టంగా 150 ఇంచ్ వరకు మంచి విజువల్స్ ఆఫర్ చేస్తుంది. ఈ ప్రొజెక్టర్ 4400 lm లైట్ తో వస్తుంది. ఇందులో, VGA, HDMI, USB సపోర్ట్ తో పాటు Dolby Audio సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది.
Also Read: Google Pixel 7a: కొత్త ఫోన్ Pixel 9a రాకతో పాత ఫోన్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్.!
ఈ జెబ్రోనిక్స్ ప్రొజెక్టర్ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సపోర్ట్, HDMI Arc, బ్లూటూత్ 5.4, AUX మరియు USB వంటి మల్టీ కనెక్టివిటీ తో వచ్చే స్మార్ట్ ప్రొజెక్టర్. ఇది కూడా 150 ఇంచ్ స్క్రీన్ ను 1080p రిజల్యూషన్ తో ఆఫర్ చేస్తుంది. ఈ ప్రొజెక్టర్ 5000 lm లైట్ తో వస్తుంది మరియు ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.3 రేటింగ్ అందుకుంది యూజర్ల నుంచి మంచి రివ్యూలను అందుకుంది. ఈ ప్రొజెక్టర్ ఈ రోజు 57% డిస్కౌంట్ తో రూ. 8,999 రేటుకే లభిస్తుంది మరియు SBI క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చెస్ వారికి రూ. 899 ధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ప్రొజెక్టర్ రూ. 8,100 ధరకే లభిస్తుంది.