Portronics లేటెస్ట్ సౌండ్ బార్స్ పైన అమెజాన్ సేల్ నుండి బిగ్ డీల్.!
Portronics కొత్త సౌండ్ బార్ లు అమెజాన్ సేల్ నుండి మంచి డీల్స్ తో లభిస్తున్నాయి
Sound Slick IV మరియు Sound Slick V సౌండ్ బార్స్ పైన అమెజాన్ ఈ డీల్స్ అందించింది
నాణ్యమైన సౌండ్ అందించేలా వీటిని రూపొందించినట్లు పోర్ట్రోనిక్స్ పేర్కొంది
Portronics ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన కొత్త సౌండ్ బార్ లు అమెజాన్ సేల్ నుండి మంచి డీల్స్ తో లభిస్తున్నాయి. పోర్టోనిక్స్ లేటెస్ట్ విడుదల చేసిన Sound Slick IV మరియు Sound Slick V సౌండ్ బార్స్ పైన అమెజాన్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్స్ స్లీక్ డిజైన్ లో పవర్ ఫుల్ సౌండ్ తో వచ్చాయి. అంతేకాదు, నాణ్యమైన సౌండ్ అందించేలా వీటిని రూపొందించినట్లు కూడా పోర్ట్రోనిక్స్ పేర్కొంది.మరి ఈ లేటెస్ట్ సౌండ్ బార్స్ ఆపైన అమెజాన్ అందించిన డీల్స్ ఏమిటో చూద్దామా.
పోర్టోనిక్స్ ఈ Sound Slick IV సౌండ్ బార్ ని రూ. 5,499 ధరతో ప్రకటించగా అమెజాన్ ఫినాలే సేల్ నుండి రూ.4,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, ఆప్టికల్, AUX మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ అప్షన్లతో వస్తుంది. ఈ సౌండ్ బార్ ఇన్ బిల్ట్ ఉఫర్ లతో కలిపి టోటల్ 120W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇక Sound Slick V సౌండ్ బార్ విషయానికి వస్తే, ఇందులో ఆప్టికల్, AUX మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ అప్షన్లతో వస్తుంది. ఈ సౌండ్ బార్ కేవలం రూ. 3,499 రూపాయల ధరతో ప్రకటించగా, అమెజాన్ సేల్ నుండి రూ.2,999 అఫర్ ధరకే లభిస్తోంది. ఇది రెండు 30W స్పీకర్లతో టోటల్ 60W సౌండ్ అవుట్ పుట్ ను అందిస్తుంది మరియు మీ బెడ్ రూమ్ కి సరిపోతుంది. ఈ రెండు సౌండ్ బార్స్ 12 నెలల వారంటీతో వస్తాయి.
1. Sound Slick IV ను రూ.4,999 రూపాయల అఫర్ ధరకే సొంతం చేసుకోవడానికి Buy From Here పైన క్లిక్ చేయండి.
2. Sound Slick V ను రూ.2,999 రూపాయల అఫర్ ధరకే సొంతం చేసుకోవడానికి Buy From Here పైన క్లిక్ చేయండి.
Portronics కొత్తగా లాంచ్ చేసిన ఈ రెండు సౌండ్ బార్స్ కూడా సన్నని మరియు సొగసైన డిజైన్ తో వస్తాయి. ఈ రెండు సౌండ్ బార్స్ స్క్రాచ్-రెసిస్టెంట్ కలిగిన శాండ్-గ్రెయిన్ ఫినిషింగ్‌తో వస్తాయి మరియు ప్రీమియం అనుభూతిని ఇస్తాయి. ముఖ్యంగా, వీటి స్లీక్ డిజైన్ కారణంగా చాలా ఈజీగా ఎక్కడైకైనా మీతో తీసుకెళ్లేలా ఉంటాయి. ఈ సౌండ్ బార్ లను యాడ్ చేయడం వలన మీ టీవీ సౌండ్ మరింత పవర్ ఫుల్ గా మరియు సినిమా థియేటర్ అనుభూతిని మీకు ఇంటిలోనే అందించగలదని కంపెనీ చెబుతోంది.