Amazon Echo Spot: అమెజాన్ ఇండియా తన Eco స్పీకర్ సిరీస్ లో మరొక కొత్త స్పీకర్ ను జత చేసింది. ఇప్పటి వరకు విడుదల చేసిన ఎకో స్పీకర్స్ మాదిరిగా కాకుండా ఈ కొత్త అలెక్సా స్పీకర్ ను కలర్ స్క్రీన్ మరియు డీప్ బాస్ స్పీకర్ తో అందించింది. ఇది స్మార్ట్ అలారమ్ క్లాక్ మరియు అలెక్సా స్పీకర్ గా మీ టేబుల్ పై గొప్ప వెసులుబాటు అందిస్తుంది. అమెజాన్ తీసుకు వచ్చిన ఈ కొత్త స్పీకర్ ధర మరియు ఫీచర్స్ పై ఒక
లుక్కేద్దామా.
అమెజాన్ ఎకో స్పాట్ రూ. 6,499 ఆఫర్ ధరతో లాంచ్ చేసింది. ఈ కొత్త ఎకో స్మార్ట్ స్పీకర్ ను Federal Bank క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 640 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్పీకర్ ను రూ. 5,859 ఆఫర్ ధరకు పొందవచ్చు. ఈ స్పీకర్ అమెజాన్ నుంచి సేల్ కి అందుబాటులోకి కూడా వచ్చింది. Buy From Here
అమెజాన్ ఎకో స్పాట్ స్మార్ట్ అలారమ్ స్పీకర్ విలక్షణమైన సౌండ్ డిజైన్ తో వస్తుంది. ఇందులో 2.83 ఇంచ్ టచ్ స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ 240 x 320 రిజల్యూషన్ మరియు హాఫ్ సర్కిల్ డిజైన్ తో ఉంటుంది. ఈ స్మార్ట్ స్పీకర్ 1GB DRAM మరియు 8GB eMMC స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ అమెజాన్ ఏకో స్పీకర్ 1.73 ఇంచ్ హై ఫెడిలిటీ ఫుల్ రేంజ్ స్పీకర్ ను ఉంటుంది. ఈ స్పీకర్ లాస్ లెస్ హై డెఫినేషన్ సపోర్ట్ తో వస్తుంది.
అమెజాన్ ఎకో స్పాట్ స్మార్ట్ అలారమ్ స్పీకర్ డ్యూయల్ బ్యాండ్ మరియు Wi-Fi బ్లూటూత్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది. ఇది Alexa app తో తో చేస్తుంది మరియు అడ్వాన్స్డ్ ఆడియో డిస్టార్షన్ Profile (A2DP) సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ స్పీకర్ డైలీ రోటిన్స్, అలారమ్ మరియు హాండ్స్ ఫ్రీ హెల్ప్ కూడా చేస్తుంది.
Also Read: Pushpa 2 Reloaded Version: 20 నిమిషాల నిడివి కొత్త ఫుటేజీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన ఫిలిం మేకర్స్.!
ఈ ఎకో స్పాట్ స్మార్ట్ స్పీకర్ అమెజాన్ మ్యూజిక్, Spotify, జియో సావన్, యాపిల్ మ్యూజిక్ మరియు Audible వంటి చాలా యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా, ఈ స్పీకర్ కష్టమైజబుల్ స్మార్ట్ క్లాక్ డిస్పీ తో ఆకట్టుకుంటుంది.