Amazon Echo Spot: కలర్ స్క్రీన్ మరియు డీప్ బాస్ సౌండ్ సపోర్ట్ తో బడ్జెట్ ధరలో వచ్చింది.!

Amazon Echo Spot: కలర్ స్క్రీన్ మరియు డీప్ బాస్ సౌండ్ సపోర్ట్ తో బడ్జెట్ ధరలో వచ్చింది.!
HIGHLIGHTS

అమెజాన్ ఇండియా తన Eco స్పీకర్ సిరీస్ లో మరొక కొత్త స్పీకర్ ను జత చేసింది

Amazon Echo Spot కొత్త అలెక్సా స్పీకర్ ను లాంచ్ చేసింది

ఈ స్పీకర్ ను కలర్ స్క్రీన్ మరియు డీప్ బాస్ స్పీకర్ తో అందించింది

Amazon Echo Spot: అమెజాన్ ఇండియా తన Eco స్పీకర్ సిరీస్ లో మరొక కొత్త స్పీకర్ ను జత చేసింది. ఇప్పటి వరకు విడుదల చేసిన ఎకో స్పీకర్స్ మాదిరిగా కాకుండా ఈ కొత్త అలెక్సా స్పీకర్ ను కలర్ స్క్రీన్ మరియు డీప్ బాస్ స్పీకర్ తో అందించింది. ఇది స్మార్ట్ అలారమ్ క్లాక్ మరియు అలెక్సా స్పీకర్ గా మీ టేబుల్ పై గొప్ప వెసులుబాటు అందిస్తుంది. అమెజాన్ తీసుకు వచ్చిన ఈ కొత్త స్పీకర్ ధర మరియు ఫీచర్స్ పై ఒక
లుక్కేద్దామా.

Amazon Echo Spot : ప్రైస్

అమెజాన్ ఎకో స్పాట్ రూ. 6,499 ఆఫర్ ధరతో లాంచ్ చేసింది. ఈ కొత్త ఎకో స్మార్ట్ స్పీకర్ ను Federal Bank క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 640 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్పీకర్ ను రూ. 5,859 ఆఫర్ ధరకు పొందవచ్చు. ఈ స్పీకర్ అమెజాన్ నుంచి సేల్ కి అందుబాటులోకి కూడా వచ్చింది. Buy From Here

Amazon Echo Spot : ఫీచర్స్

అమెజాన్ ఎకో స్పాట్ స్మార్ట్ అలారమ్ స్పీకర్ విలక్షణమైన సౌండ్ డిజైన్ తో వస్తుంది. ఇందులో 2.83 ఇంచ్ టచ్ స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ 240 x 320 రిజల్యూషన్ మరియు హాఫ్ సర్కిల్ డిజైన్ తో ఉంటుంది. ఈ స్మార్ట్ స్పీకర్ 1GB DRAM మరియు 8GB eMMC స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ అమెజాన్ ఏకో స్పీకర్ 1.73 ఇంచ్ హై ఫెడిలిటీ ఫుల్ రేంజ్ స్పీకర్ ను ఉంటుంది. ఈ స్పీకర్ లాస్ లెస్ హై డెఫినేషన్ సపోర్ట్ తో వస్తుంది.

Amazon Echo Spot

అమెజాన్ ఎకో స్పాట్ స్మార్ట్ అలారమ్ స్పీకర్ డ్యూయల్ బ్యాండ్ మరియు Wi-Fi బ్లూటూత్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది. ఇది Alexa app తో తో చేస్తుంది మరియు అడ్వాన్స్డ్ ఆడియో డిస్టార్షన్ Profile (A2DP) సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ స్పీకర్ డైలీ రోటిన్స్, అలారమ్ మరియు హాండ్స్ ఫ్రీ హెల్ప్ కూడా చేస్తుంది.

Also Read: Pushpa 2 Reloaded Version: 20 నిమిషాల నిడివి కొత్త ఫుటేజీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన ఫిలిం మేకర్స్.!

ఈ ఎకో స్పాట్ స్మార్ట్ స్పీకర్ అమెజాన్ మ్యూజిక్, Spotify, జియో సావన్, యాపిల్ మ్యూజిక్ మరియు Audible వంటి చాలా యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా, ఈ స్పీకర్ కష్టమైజబుల్ స్మార్ట్ క్లాక్ డిస్పీ తో ఆకట్టుకుంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo