LG Dolby Atmos సౌండ్ బార్ పై జబర్దస్త్ ఆఫర్ అందుకోండి.!

LG Dolby Atmos సౌండ్ బార్ పై జబర్దస్త్ ఆఫర్ అందుకోండి.!
HIGHLIGHTS

LG Dolby Atmos పై ఈరోజు జబర్దస్త్ ఆఫర్ అందుబాటులో ఉంది

LG 600W 5.1.1 పవర్ ఫుల్ సౌండ్ బార్ ను బడ్జెట్ లో అందుకోవచ్చు

ఈ సౌండ్ బార్ పై అమెజాన్ రూ. 8,000 భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది

LG Dolby Atmos పై ఈరోజు జబర్దస్త్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ధమాకా ఆఫర్ తో LG 600W 5.1.1 పవర్ ఫుల్ సౌండ్ బార్ ను కేవలం 27 వేల రూపాయల బడ్జెట్ లో అందుకోవచ్చు. వాస్తవానికి, ఈ సౌండ్ బార్ నిన్న మొన్నటి వరకు 38 వేల రూపాయల బడ్జెట్ లో అమ్మడు అయ్యింది. ఇది మాత్రమే కాదు ఈ సౌండ్ బార్ ఇటీవలే ఇండియాలో లాంచ్ అయిన బెస్ట్ సౌండ్ బార్ లలో ఒకటిగా నిలుస్తుంది.

LG Dolby Atmos Soundbar : ఆఫర్

ఇండియాలో రీసెంట్ గా విడుదలైన LG సౌండ్ బార్ మోడల్ నెంబర్ SQ75TR పై అమెజాన్ ఈరోజు జబర్దస్త్ డీల్ ను అందించింది. ఈరోజు రూ. 37,990 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లిస్ట్ అయిన ఈ సౌండ్ బార్ పై అమెజాన్ రూ. 8,000 భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ రూ. 29,990 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది.

LG Dolby Atmos Soundbar

ఇంతటితో అయిపోలేదు, ఈ ఫోన్ పై మరొక గొప్ప ఆఫర్ ను కూడా అందించింది. ఈ సౌండ్ బార్ ను Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 2,000 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ బ్యాంక్ ఆఫర్ తో ఈ LG సౌండ్ బార్ ను కేవలం రూ. 27,990 రూపాయల అతి తక్కువ ధరకు అందుకోవచ్చు. Buy From Here

Also Read: Poco X7 Series 5G నుంచి రెండు ఫోన్లు లాంచ్ చేస్తున్న పోకో.!

LG Dolby Atmos Soundbar : ఫీచర్స్

ఈ సౌండ్ బార్ 5.1.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ మూడు ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు మరియు 1 సెంటర్ అప్ ఫైరింగ్ స్పీకర్ కలిగిన బార్, 2 శాటిలైట్ స్పీకర్లు మరియు 1 పవర్ ఫుల్ సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 600W పవర్ ఫుల్ మరియు గ్రౌండ్ షేకింగ్ సౌండ్ అందిస్తుంది.

ఈ సౌండ్ బార్ Dolby Atmos మరియు DTS:X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ లతో పాటు Ai Sound Pro మరియు Wow Synergy సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ HDMI eArc, Pass-through (4K), USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo