PHILIPS Dolby Atmos సౌండ్ బార్ పై బిగ్ డీల్స్ అనౌన్స్ చేసిన అమెజాన్.!

PHILIPS Dolby Atmos సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ ఇండియా గొప్ప డీల్స్ అందించింది. ప్రపంచ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఇండియాలో విడుదల చేసిన పవర్ ఫుల్ సౌండ్ బార్ పై ఈ డీల్ అందించింది. స్మార్ట్ టీవీ కి తగిన కాంపాక్ట్ సైజులో పవర్ ఫుల్ BASS అందించే సౌండ్ బార్ కోసం చూస్తున్న వారు ఈ డీల్ ను పరిశీలించవచ్చు.
ఏమిటా PHILIPS Dolby Atmos సౌండ్ బార్ డీల్?
2022 లో ఫిలిప్స్ ఇండియాలో విడుదల చేసిన Audio TAB7807 సౌండ్ బార్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఇండియాలో రూ. 28,990 ధరతో వచ్చింది. అయితే, ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి మంచి డిస్కౌంట్ తో కేవలం రూ. 21,990 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. అంతేకాదు , ఈ సౌండ్ బార్ ను అమెజాన్ నుంచి HDFC క్రెడిట్ కార్డ్ ఆప్షన్ రో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
అమెజాన్ అందించింది ఈ రెండు ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 20,490 రూపాయల ఆఫర్ ధరకు ఈరోజు అందుకోవచ్చు.
PHILIPS Dolby Atmos : ఫీచర్స్
ఈ ఫిలిప్స్ సౌండ్ బార్ 3.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో 6 ఇంటిగ్రేటెడ్ స్పీకర్లు కలిగిన బార్ మరియు 8 ఇంచ్ పవర్ ఫుల్ బిగ్ స్పీకర్ కలిగిన సబ్ ఉఫర్ సెటప్ వుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 620W RMS పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ ఇంటిని షేక్ చేసే పవర్ ఫుల్ బాస్ సౌండ్ అందిస్తుంది.
ఈ ఫిలిప్స్ సౌండ్ బార్ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, HDMI, Aux in (3.5mm) మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.