AirPods 4: బడ్జెట్ ధరలో డైనమిక్ హెడ్ ట్రాక్ తో లాంచ్ చేసిన యాపిల్.!

AirPods 4: బడ్జెట్ ధరలో డైనమిక్ హెడ్ ట్రాక్ తో లాంచ్ చేసిన యాపిల్.!
HIGHLIGHTS

AirPods 4 సిరీస్ బడ్స్ ను బడ్జెట్ ధరలో స్టన్నింగ్ ఫీచర్ తో లాంచ్ చేసింది

ఎయిర్ పాడ్స్ 4 మరియు ఎయిర్ పాడ్స్ 4 యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ బడ్స్ ను లాంచ్ చేసింది

రెండు పాడ్స్ ప్రీ ఆర్డర్స్ ను కూడా యాపిల్ మొదలు పెట్టింది

AirPods 4: కాలిఫోర్నియాలోని యాపిల్ ప్రధాన కార్యాలయం నుంచి కొత్త ప్రొడక్ట్స్ ను లాంచ్ చేసింది. ఇందులో ఎయిర్ పాడ్స్ 4 సిరీస్ బడ్స్ ను బడ్జెట్ ధరలో స్టన్నింగ్ ఫీచర్ తో లాంచ్ చేసింది. ఈ సిరీస్ నుంచి ఎయిర్ పాడ్స్ 4 మరియు ఎయిర్ పాడ్స్ 4 యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ బడ్స్ ను లాంచ్ చేసింది. ఈ రెండు పాడ్స్ ప్రీ ఆర్డర్స్ ను కూడా యాపిల్ మొదలు పెట్టింది. ఈ కొత్త పాడ్స్ ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దామా.

AirPods 4: ప్రైస్

ఇందులో, ఎయిర్ పాడ్స్ 4 ను రూ. 12,999 విడుదల చేసింది. అయితే, ఎయిర్ పాడ్స్ 4 నోయిస్ క్యాన్సిలేషన్ ను మాత్రం రూ. 17,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ రెండు బడ్స్ కూడా ప్రీ ఆర్డర్ కు అందుబాటులోకి వచ్చాయి.

AirPods 4: ఫీచర్స్

ఈ రెండు బడ్స్ కూడా దాదాపుగా ఒకే విధమైన ఫీచర్స్ ను కలిగి ఉంటాయి. అయితే, ఎయిర్ పాడ్స్ 4 యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ (ANC) మాత్రం పేరు సూచించినట్లుగా ANC సపోర్ట్ తో వస్తుంది. ఈ రెండు కొత్త యాపిల్ పాడ్స్ కూడా కస్టమ్ హై ఎక్స్ కర్షన్ యాపిల్ స్పీకర్లు మరియు కస్టమ్ హై డైనమిక్ రేంజ్ ఆంప్లిఫయర్ తో వస్తాయి. వీటిలో, ఎయిర్ పాడ్స్ 4 వాయిస్ ఐసోలేషన్ తో వస్తే, ఎయిర్ పాడ్స్ 4 ANC బడ్స్ మాత్రం యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ తో వస్తుంది.

AirPods 4 Launched

ఈ రెండు బడ్స్ లో కూడా అడాప్టివ్ ఎక్వలైజర్ సపోర్ట్ వుంది. డైనమిక్ హెడ్ ట్రాకింగ్ తో కూడిన పర్సనలైజ్డ్ స్పెటియల్ ఆడియో టెక్నాలజీ సపోర్ట్ వుంది. ANC పాడ్స్ లో మాత్రం Adaptive Audio4, Transparency mode మరియు Conversation Awareness మోడ్స్ ఉంటాయి.

ఎయిర్ పాడ్స్ 4 H2 హెడ్ ఫోన్ చిప్ తో పని చేస్తాయి. ఈ రెండు ప్యాడ్స్ లో డ్యూయల్ బీమ్ ఫార్మింగ్ మైక్రో ఫోన్స్, ఆప్టికల్ ఇన్ ఇయర్ సెన్సార్, స్పీచ్ డెటెక్టింగ్ ఎగ్జిలరోమీటర్ మరియు మోషన్ డిటెక్టింగ్ ఎగ్జిలరోమీటర్ సెన్సార్ లు కూడా ఉన్నాయి.

Also Read: Apple Intelligence తో వచ్చిన iPhone 16 మరియు 16 Plus ఇండియా ప్రైస్ తెలుసుకోండి.!

ఈ పాడ్స్ IP54 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంటాయి. ఈ బడ్స్ ను USB-C కనెక్టర్ సపోర్టర్ తో అందించింది. ఈ బడ్స్ సింగల్ ఛార్జ్ పై 5 గంటల టాక్ ప్లే టైం, 4.5 గంటల టాక్ టైం మరియు పూర్తి ఛార్జింగ్ తో 30 గంటల ప్లే టైం మరియు 20 గంటల టాక్ టైం అందిస్తుంది. ఈ పాడ్స్ బ్లూటూత్ వెర్షన్ 5.3 తో వస్తుంది. ఇది Live Listen audio తో గప్ప సౌండ్ అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo