కొత్త ఫీచర్: IPhone లో Whatsapp లో YouTube , వాయిస్ మెసేజ్ ఇప్పుడు మరింత సింపుల్ ….

Updated on 22-Dec-2017

న్యూ ఢిల్లీ ఆపిల్ ఫోన్ (iOS) కోసం వాట్స్ యాప్  నుండి కొత్త అప్డేట్  విడుదల చేయబడింది. దీనిలో మీరు వాట్స్ యాప్  లో నేరుగా YouTube వీడియోలను చూడగలుగుతారు. అదే సమయంలో, వినియోగదారులు వీడియోలను చూస్తున్నప్పుడు చాట్ చెయ్యగలరు. ఇదికాకుండా, WhatsApp యాప్ కి వాయిస్ మెసేజెస్ ను పంపడానికి ఇకపై మీరు బటన్ను హోల్డ్ చేయాలిసిన  అవసరం ఉండదని మరొక అప్డేట్  ఇవ్వబడింది. అయితే, ఈ అప్డేట్  (iOS V2.17.81) కేవలం ఐఫోన్ యొక్క IOS కోసం మాత్రమే  ఇవ్వబడింది.

చాట్  చేస్తూ వీడియోలను చూడగలరు 
 
ఇంతకూ ముందర  మీరు WhatsApp యాప్ లో YouTube వీడియోకి లింక్ ని పొందినప్పుడు . అప్పుడు, మీరు దానిపై క్లిక్ చేసిన వెంటనే, వీడియోను స్మార్ట్ఫోన్లో YouTube యాప్ లో ఓపెన్ అవుతుంది . కానీ ఇప్పుడు కొత్త  అప్డేట్  తర్వాత, అది జరగదు. ఇప్పుడు మీరు నేరుగా Whatsapp యాప్ లో  వీడియో ప్లే చేసుకోవచ్చు. అది 'పిక్చర్ ఇన్ పిక్చర్' (పి పి) కు మద్దతిస్తుంది. అలాంటి విధంగా, ఇప్పుడు మీరు వీడియోలను చూస్తూ చాట్ చేయవచ్చు.

లాంగ్ వాయిస్ మెసేజ్  పంపడం సులభం అవుతుంది
 
వాట్స్ యాప్ లో  వాయిస్ మెసేజ్ పంపించడానికి మైక్ యొక్క ఐకాన్ హోల్డ్ చేసి ఉంచాలి. ఎంత ఎక్కువ కాలం హోల్డ్ చేసి ఉంచితే అంత  ఎక్కువసేపు మెసేజ్  రికార్డు అవుతుంది . కానీ ఇప్పుడు కొత్త అప్డేట్ తో, లాంగ్ వాయిస్ మెసేజ్ కూడా రికార్డు  చేయబడతాయి. ఇప్పుడు లాంగ్ వాయిస్ మెసేజ్ కోసం కేవలం స్వైప్  చేయాలి . అటువంటి సందర్భంలో వేలిని తొలగించిన తర్వాత కూడా రికార్డింగ్ కొనసాగుతుంది.

Connect On :