Youtube ఈ రోజు కొత్త ఫీచర్ ను అప్ డేట్ చేసింది. దీని పేరు smart offline. ఇండియన్ users కు మాత్రమే ఈ అప్ డేట్ ఉంటుంది అని అంచనా.
ఇండియాలో దాదాపు అన్ని టెలికాం నెట్ వర్క్స్ స్పెషల్ గా night time మొబైల్ ఇంటర్నెట్ ను వాడుకునేలా సెపరేట్ గా night data ఇవటం జరుగుతుంది.
సో దీనిని సీరియస్ గా తీసుకుంది youtube. మీరు ఇక నుండి ఏదైనా వీడియో ను ఆఫ్ లైన్ లో చూసేందుకు "Save Video offline" ఫీచర్ పై టాప్ చేస్తే…
మీకు "save overnight" అనే ఆప్షన్ వస్తుంది. ఇది సెలెక్ట్ చేసుకుంటే ఆటోమాటిక్ గా నైట్ టైం డౌన్లోడ్ అవుతుంది వీడియో. ఇది కేవలం మొబైల్ ఇంటర్నెట్ లో ఉన్నప్పుడే కన్పిస్తుంది. WiFi లో కనిపించదు.
so next మార్నింగ్ మీరు బయటకు వెళ్ళినప్పుడు ఆ వీడియో ఇంటర్నెట్ అవసరం లేకుండా ఆఫ్ లైన్ లో చూడగలరు. అలాగే మీ night data కూడా ఉపయోగంగా వాడుకున్నట్లే.
అయితే అప్ డేట్ telecom operators వైజ్ గా రోల్ అవుతుంది. ప్రస్తుతం ఎయిర్టెల్ అండ్ Telenor కు అప్ డేట్ అయ్యింది.