ప్రపంచంలోనే మొట్టమొదటిగా Youtube GO అనే యాప్ ను ఇండియాలో లాంచ్ చేసింది గూగల్. ఇది ఇంకా users కు విడుదల కాలేదు. అందరికీ రావటానికి మినిమమ్ ఒక నెల పడుతుంది అని అంచనా .
ఈ లోపు మీరు కావాలనుకుంటే ఈ లింక్ లో sign up కూడా చేసుకోగలరు. సో మీకు విడుదల అయినప్పుడు తెలియజేస్తుంది. ఇంతకీ దేనికి Youtube GO?
ఇది మీరు వీడియో ప్లే చేసే ముందు వీడియో ఎంత సైజ్ కలిగి ఉందో తెలియజేస్తుంది. అలాగే వీడియో యొక్క ప్రివ్యూ ను డిఫరెంట్ timings లోని అనేక thumbnails తో చూపిస్తుంది. అంటే వీడియో ను ఓపెన్ చేయకముందే కంటెంట్ ఏంటో చూడగలరు.
ఇంకా వీడియోస్ సేవ్ చేసుకోగలరు. అలాగే save చేసిన వాటిని ఇంటర్నెట్ లేని వారికి కూడా షేర్ చేయగలరు. అంటే అవతల వ్యక్తి కి కూడా ఈ యాప్ ఉంటే బ్లూ టూత్ సహాయంతో వీడియో షేర్ చేయగలరు వారికి.
వీడియోస్ రికమెండేషన్స్ కూడా మీ ఏరియా కు అనుగుణంగా చూపిస్తుంది , దేశానికీ అనుగుణంగా కాదు. అంటే మీ లోకల్ ఏరియా లో ఏ వీడియో బాగా పాపులర్ దాని బట్టి కూడా ఉంటాయి.
గతంలో ఆఫ్ లైన్ కాన్సెప్ట్ లోనే offline mode అనే ఫీచర్ ను ఫోన్ లో వీడియోస్ ను సేవ్ చేసుకునేలా కలిపించింది గూగల్. ఆ తరువాత నైట్ ఇంటర్నెట్ డేటా ఉన్న వారికి ఆటోమాటిక్ డౌన్లోడ్స్ ద్వారా స్మార్ట్ ఆఫ్ లైన్ ఫీచర్ తో మరొక ఫీచర్ తీసుకువచ్చింది.