యాస్ తుఫాన్: మీరు UMANG యాప్ ద్వారా యాస్ తుఫాను ట్రాక్ చేయవచ్చు
UMANG యాప్ తో లేటెస్ట్ సైక్లోన్ యాస్ ను పూర్తిగా ట్రాక్ చెయ్యవచ్చు
ఇప్పుడు మళ్ళి మరొక తుఫాన్ యాస్ ముంచుకొస్తోంది
Yaas Cyclone యొక్క ఫోటోతో అప్డేట్స్ కనిపిస్తాయి
యాస్ తుఫాన్: మీరు UMANG యాప్ ద్వారా యాస్ తుఫాను ట్రాక్ చేయవచ్చు. ప్రభుత్వ అధికారిక యాప్ అయిన UMANG యాప్ తో లేటెస్ట్ సైక్లోన్ యాస్ ను పూర్తిగా ట్రాక్ చెయ్యవచ్చు. మొన్ననే తౌక్తే తుఫాన్ కొన్ని రాష్ట్రాలను అల్లకల్లోలం చేస్తే, ఇప్పుడు మళ్ళి మరొక తుఫాన్ యాస్ ముంచుకొస్తోంది. ఇప్పటికే, దీనిపైన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. అయితే, యాస్ తుఫాన్ ఎప్పుడు ఎలా మారుతుంది మరియు ఏ తీరినికి చేరుతుందనే విషయాలను UMANG యాప్ ద్వారా చాలా సులభంగా ట్రాక్ చేయవచ్చు.
ఇప్పటికే UMANG యాప్ వున్నవారికి ఈ ఫీచర్ గురించి చూసి వుంటారు. కొత్తగా UMANG యాప్ డౌన్లోడ్ చేసుకొని యాస్ తుఫాన్ అప్డేట్ లను చూడాలనుకునే వారికీ కూడా ఇది చాలా సులభంగా వుంటుంది. అప్డేట్స్ మీకు ఈ యాప్ లో 'ఇండియా మెట్రోలాజికల్ డిపార్ట్ మెంట్' ద్వారా అందించబడతాయి.
UMANG యాప్ ఓపెన్ చేయగానే మీకు Yaas Cyclone యొక్క ఫోటోతో అప్డేట్స్ కనిపిస్తాయి. ఈ ఫోటో పైన నొక్కిన వెన్తనే మీరు వాతావరణ శాఖ వారి మెయిన్ పేజీకి వెళతారు. ఇక్కడ మీకు అవసరమైన వివరాల కోసం చాలా ట్యాబ్స్ కనిపిస్తాయి. అందులో, 'Cyclone' ట్యాబ్ ను ఎంచుకుంటే మీకు అన్ని వివరాలు లేటెస్ట్ అప్డేట్ లతో సహా వస్తాయి.