సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం, ఫేస్ బుక్ ఆండ్రాయిడ్ యాప్ లో కొత్తగా TOR సపోర్ట్ ను యాడ్ చేసింది. Tor అనేది ప్రధానంగా ప్రైవేసీ ను ఇవ్వటానికి. ఇది extension ఫీచర్ గా పనిచేయనుంది యాప్ లో.
ఇది యాప్ లో ఫేస్ బుక్ ను డెస్క్ టాప్ ఇంటర్ఫేస్ తో చూపించటానికి. Tor ప్రాజెక్ట్ spokesman మాట్లాడుతూ.."ఇది ఫేస్ బుక్ users కు లొకేషన్ డేటా ను షేర్ చేయాలా వద్దా అని చూస్ చేసుకునే అవకాశం ఇస్తుంది."
Signal అనే encrypted మెసేజింగ్ యాప్ ద్వారా అతను ఈ విషయాన్ని వెల్లడించారు. ఫేస్ బుక్ లో ఉన్న ప్రతీ user కు ప్రైవేసీ చాలా ముఖ్యం అని కూడా అన్నారు.
Tor iOS కు సపోర్ట్ చేసే ప్లాన్స్ లేవని చెప్పారు. ప్రస్తుతం కేవలం ఆండ్రాయిడ్ పైనే ఉంది ఇది. Tor ను use చేయటానికి .. Orbot proxy యాప్ ను డౌన్లోడ్ చేయాలి.
ఇది anonymity నెట్ వర్క్ కు కనెక్ట్ చేస్తుంది. ఆ తరువాత ఫేస్ బుక్ యాప్ యొక్క సెట్టింగ్స్ లో మార్పులు చేయాలి Tor సపోర్ట్ కొరకు.