Yahoo LiveText చాటింగ్ అప్లికేషన్ లాంచ్
జులై 11 న ios కు వచ్చింది, ఇప్పుడు ఆండ్రాయిడ్ కు అందుబాటులో
యాహూ తాజాగా కొత్త మెసెంజర్ యాప్ ను లాంచ్ చేసింది. దీని పేరు "Yahoo Livetext – Video Chat". జులై 11 న ios ఫోనులకు లాంచ్ అయ్యింది ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్స్ కూడా వచ్చింది. ప్రస్తుతానికి మరే ఇతర మొబైల్ os లకు ఇది రిలీజ్ కాలేదు ఇంకా.
4.1 రేటింగ్ తో ఉంది ప్లే స్టోర్ లో. దీని సైజ్ 15.44 MB. 2G ఇంటర్నెట్ స్పీడ్ కనెక్షన్ లో డౌన్లోడ్ అవ్వటానికి 15 నిముషాలు పడుతుంది సుమారు. ఆండ్రాయిడ్ యూజర్స్ దీనిని ఈ లింక్ నుండి డౌన్లోడ్ చేయగలరు. ios యూజర్స్ ఈ లింక్ లో డౌన్లోడ్ చేయగలరు.
Livetext ఏమి చేస్తుంది?
ఇది చాటింగ్ అప్లికేషన్. కాకపోతే దీనిలో కొత్త ఫీచర్ ఉంది. Livetext లో చాటింగ్ చేసుకుంటున్న ఇద్దరు వ్యక్తులూ ఒకరికొకరు వాళ్ల వీడియోను సౌండ్ లేకుండా చూసుకుంటూ..text రూపంలో చాట్ చేసుకోగలరు. అంటే చాటింగ్ చేసేటప్పుడు వాళ్లు నిజంగా మీకు దగ్గరిగా ఉంటున్నట్టు అనిపిస్తుంది.
పైన ఇచ్చిన లింక్ నుండి డౌన్లోడ్ చేసిన తరువాత, మీ నంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఆ నంబర్ మీ యాహు అకౌంట్ కు ఇంతకముందే మీరు అనుసందిస్తే ఇప్పుడు ఆ అకౌంట్ తో లాగిన్ అవ్వాలా లేదా కొత్త యాహు అకౌంట్ ఓపెన్ చేస్తారా అని అడుగుతుంది. తరువాత ఒక Livetext id క్రియేట్ చేసుకుంటే…ఇక మిమ్మల్ని ఎవరైనా యాహు livetext లో ఆ id తో కాంటాక్ట్ అవ్వగలరు.
తరువాత మీ ఫోనులోని కాంటాక్ట్స్ ను రీడ్ చేయటానికి మీరు పర్మిషన్ ఇస్తే మీ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఈ యాప్ ను ఇంస్టాల్ చేసుకుంటే వాళ్లను చూపిస్తుంది లేని వాళ్ళకి invite పంపగలగుతారు. కాన్సెప్ట్ నిజంగా కొత్తగానే ఉంది, సో ఇది పాపులర్ అయ్యే చాన్సేస్ ఉన్నాయి.. కానీ ఆఫ్ కోర్స్ ఫేస్ బుక్ లా, యాహు కూడా ఫీక్వెంట్ గాకొత్త కొత్త ఆప్షన్స్ ఇస్తేనే longterm సక్సెస్ లైన్ లో ఉంటుంది.