వాట్స్ అప్ లో కొత్తగా Reply ఆప్షన్ యాడ్ అయ్యింది చాట్స్ లో. ఇది ఆల్రెడీ ప్లే స్టోర్ లో అప్ డేట్ రోల్ అయ్యింది.
సో మీరు లేటెస్ట్ అప్ డేట్ కు అప్ డేట్ అయితే చాలు దీనిని వాడగలరు. ఇది గ్రూప్స్ అండ్ సింగిల్ చాట్ విండోస్ లో కూడా పనిచేస్తుంది.
అంటే మీరు పంపించే మెసేజ్ అవతల వ్యక్తీ పంపిన చాలా మెసేజెస్ లో దేనికో అని ఈజీగా తెలియజేయటానికి.
ఫర్ eg: మీరు పర్టికులర్ గా అవతల వ్యక్తీ పంపిన ఒక మెసేజ్ ను ఉద్దేశించి ఏదైనా చెప్పాలనుకుంటే ఆ మేసేజ్ పై లాంగ్ టాప్ చేసి, పైన రైట్ సైడ్ reply సింబల్ పై టాప్ చేస్తే ఇక మీరు పంపబోయే reply దేనికి సంబంధించినదో ఈజీగా తెలుస్తుంది. పైన వారి మెసేజ్, క్రింద మీ reply ఇలా ఈ రెండూ కలిసి ఒక చాట్ లా సెండ్ అవుతాయి.
2.16.95 వెర్షన్ లో ఉంది ఈ అప్ డేట్. మీరు quote చేసిన మెసేజ్ పై టాప్ చేస్తే ఆ ఒరిజినల్ మెసేజ్ ఎక్కడ ఉందో అక్కడకు తీసుకువెళ్తుంది కూడా.