WhatsAppలో బ్యాక్ గ్రౌండ్ కు కొత్త సొబగులు అందించే కొత్త ఫీచర్ వస్తోంది.!

Updated on 23-Jul-2024
HIGHLIGHTS

గొప్ప యూజర్ ఎక్స్ పీరియన్స్ అందించడానికి WhatsApp కొత్త ఫీచర్ లను వరసపెట్టి విడుదల చేస్తోంది

రీసెంట్ గా యానిమేటెడ్ ఎమోజీ లను వాట్సాప్ లో జత చేసిన వాట్సాప్

బ్యాక్ గ్రౌండ్ కు కొత్త సొబగులు అందించే కొత్త ఫీచర్ ను తీసుకువస్తోంది

WhatsApp యాప్ ను మరింత సౌకర్యవంతంగా మార్చడానికి మరియు గొప్ప యూజర్ ఎక్స్ పీరియన్స్ అందించడానికి కొత్త ఫీచర్ లను వరసపెట్టి విడుదల చేస్తోంది. రీసెంట్ గా యానిమేటెడ్ ఎమోజీ లను వాట్సాప్ లో జత చేసినట్లు తెలిపిన వాట్సాప్, ఇప్పుడు బ్యాక్ గ్రౌండ్ కు కొత్త సొబగులు అందించే కొత్త ఫీచర్ ను తీసుకు రావడానికి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త ఫీచర్ తో వాట్సాప్ స్టేటస్ లో బ్యాక్ గ్రౌండ్ కి గ్రేడియంట్ ఫిల్టర్ ను ఆటోమాటిగ్గా అందించే ప్రయత్నం చేస్తోంది.

ఎప్పటి మాదిరిగానే ఈ విషయాన్ని వాబీటాఇన్ఫో తన X అకౌంట్ నుండి షేర్ చేసింది. అంతేకాదు, ఈ ఫీచర్ ఎలా ఉంటుందో తెలిపే స్క్రీన్ షాట్ ను కూడా అందించింది. ఈ ఫీచర్ ను బ్యాక్ గ్రౌండ్ గ్రేడియంట్ ఫిల్టర్ అని పిలుస్తోంది మరియు ఈ స్క్రీన్ షాట్ లో దీని గురించి వివరంగా చూపించింది.

Also Read: Flipkart GOAT sale నుంచి భారీ తగ్గింపు తో 30 వేలకు లభిస్తున్న 55 ఇంచ్ QLED Smart Tv లు ఇవే.!

WhatsApp Background Gradient Filter

వాట్సాప్ బ్యాక్ గ్రౌండ్ గ్రేడియంట్ ఫిల్టర్ ఫీచర్ ను వాట్సాప్ బీటా అప్డేట్ 2.24.15.11 తో అందిస్తుందని వాబీటాఇన్ఫో తెలిపింది. వాట్సాప్ ఈ అప్డేట్ తో స్టేటస్ అప్డేట్ స్క్రీన్ కు యూజర్ ఫ్రెండ్లీ డిజైన్ అందించడానికి చూస్తోంది. వాట్సాప్ స్టేటస్ మరియు మెనూ లకు కొత్త ఫీచర్ లను అందించిన వాట్సాప్ ఇప్పుడు స్టేటస్ అప్డేట్ కు మరింత ఆహ్లాదకరమైన ఈ ఫీచర్ ను అందించే ప్రయత్నం చేస్తోంది.

ఈ ఫీచర్ తో స్టేటస్ లో జత చేసే వీడియోలు మరియు ఫోటో లకు బ్యాక్ గ్రౌండ్ గ్రేడియంట్ ఫిల్టర్ యాడ్ అవుతుంది. అంటే, ఇప్పటి వరకు సాధారణంగా కనిపించే స్టేటస్ అప్డేట్ ఇప్పుడు బ్లర్ గా ఉండే బ్యాక్ గ్రౌండ్ తో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

వాట్సాప్ ఇటీవల బీటా టెస్టర్ ల కోసం కొత్తగా యానిమేటెడ్ ఎమోజీ లను యాడ్ చేసింది. కొత్త బీటా అప్డేట్ తో ఈ ఫీచర్ అందుకున్న యూజర్లు ఈ ఎమోజీ లను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కొత్త అప్డేట్ తో వచ్చే యానిమేటెడ్ ఎమోజీ లతో మీకు నచ్చిన వారిని సప్రైజ్ చేయవచ్చు. సాధారణ ఎమోజీ లకు బదులు ఈ కొత్త యానిమేటెడ్ ఎమోజీలను ఒకసారి ట్రై చేయండి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :