ఆశ్చర్యకరంగా, ప్రస్తుతం Whatsapp ఒక జాబితాను విడుదల చేసింది, దీనిలో జనాదరణ పొందిన ఈ మెసేజింగ్ యాప్ ను అతిత్వరలో చాలా ఫోన్లలో ఆపివేయబోతోందని ప్రకటించింది. వాట్సాప్, తన తరచుగా అడిగే ప్రశ్నల విభాగాన్ని అప్‌డేట్ చేసింది మరియు ఫిబ్రవరి 1, 2020 నుండి ఈ యాప్ కొన్ని ఆండ్రాయిడ్ మరియు iOS పరికరాల్లో పనిచేయడం ఆగిపోతుందని తెలియచేసింది.
ఆండ్రాయిడ్ 2.3.7 మరియు iOS 7 నడుస్తున్న డివైజులు వచ్చే ఏడాది నుంచి వాట్సాప్ కు మద్దతు ఇవ్వవని తరచుగా అడిగే ప్రశ్నల విభాగం పేర్కొంది. 1 ఫిబ్రవరి 2020 నుండి ఈ డివైజులు కొత్త ఖాతాలను నమోదు చేసుకోవాలి లేదా ఉన్న ఖాతాలను తిరిగి "Verify" చేసుకోవాల్సి ఉంటుందని వాట్సాప్ తెలిపింది.
ఇది కాకుండా, వాట్సాప్ 31 డిసెంబర్ 2019 నుండి అన్ని విండోస్ ఫోన్ల నుండి అధికారిక మద్దతును ఉపసంహరించుకుంటుంది. 1 జూలై 2019 నుండి మైక్రోసాఫ్ట్ స్టోర్ నుండి ఈ యాప్ తొలగించబడింది.
మీ ఫోను కూడా ఈ జాబితాలో చేర్చబడితే, డిసెంబర్ 31 కి ముందు మీరు మీ చాట్ మరియు సమాచారాన్ని భద్రపరచుకోవాల్సివుంటుంది. మీరు మీడియా లేదా మీడియా ఫైల్స్ లేకుండా చాట్ హిస్టరీని కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
వాట్సాప్ యొక్క ఈ కొత్త దశ ఇబ్బంది పడతామని చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, Android 2.3.7 లేదా Android Gingerbread పైన నడుస్తున్న Android పరికరాలు కేవలం 0.3% మాత్రమే ఉన్నాయి.
ఫేస్ బుక్ యాజమాన్యంలోని వాట్సాప్ కు కొత్త ఫీచర్ వచ్చింది, అంటే కంపెనీ వాట్సాప్‌లో కొత్త ఫీచర్ ను జోడించింది. ఈ ఫీచర్ ద్వారా, వినియోగదారులు ఇన్‌కమింగ్ కాల్స్ గురించిన సమాచారాన్ని పొందబోతున్నారు. ఇప్పుడు మీరు మరొక కాల్ లో ఉంటే, ఈ సమయంలో మీ వాట్సాప్‌లో మీకు మరో కాల్ వస్తే, మీరు నోటిఫికేషన్ అందుకుంటారు, మీరు ఈ కాల్ గురించి తెలుసుకోవచ్చని కూడా చెప్పవచ్చు. అయితే, ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఐఫోన్ వినియోగదారులకు మాత్రమే విడుదల చేయబడింది.