Whatsapp: ఈ యాప్స్ వాడితే మీ అకౌంట్ క్లోజ్!!
Whatsapp యూజర్లకు హెచ్చరిక
ఈ Apps వాడే వారి అకౌంట్ బ్యాన్
ఒక్కసారి చెక్ చేసుకోండి
Whatsapp: వాట్సాప్ వినియోగదారులను ఒక ముఖ్యమైన విషయం గురించి హెచ్చరించింది. వాట్సాప్ యొక్క అధికారిక యాప్ కాకుండా థర్డ్ పార్టీ యాప్ ఉపయోగిస్తున్న యూజర్ల కోసం ఈ హెచ్చరిక చేసింది. థర్డ్ పార్టీలు రుపొంచిన వాట్సాప్ యాప్ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా అధికారిక Whatsapp App కి మారాలని లేకపోతే వెంటనే వారి అకౌంట్ లను బ్యాన్ చేస్తుందని వాట్సాప్ వెల్లడించింది.
ఇటువంటి చర్యలను తీసుకోవడానికి గల కారణాన్ని కూడా వివరించింది. వాట్సాప్ ఎప్పుడూ థర్డ్ పార్టీ యాప్స్ ని సపోర్ట్ చెయ్యదని మరియు వాటి వలన జరిగే నష్టాలకు బ్యాధిత తీసుకోదని కూడా తెలిపింది. అందుకే, థర్డ్ పార్టీ యాప్ ఉపయోగించాలని కోరింది. అంతేకాదు, మీకు Temporarily Banned వంటి మెసేజిలు కనుక మీకు వస్తే మీరు అధికారిక వాట్సాప్ ఉప్పయోగించడం లేదని అర్ధం. ఎందుకంటే, ఒరిజినల్ అధికారిక వాట్సాప్ యాప్ వాడుతున్న వారికి ఇటువంటి మెసేజ్ లు రావని గుర్తుంచుకుండి.
అందుకే, మీ వాట్సాప్ అకౌంట్ పూర్తిగా బ్యాన్ అవ్వక ముందే అధికారిక వాట్సాప్ యాప్ ని డౌన్ లోడ్ చేసుకొని, లాగిన్ అవ్వడం మంచిది. అయితే, మీరు థర్డ్ పార్టీ యాప్ డిలీట్ చేసే ముందుగా మీ అకౌంట్ చాట్ మరియు డేటాని పూర్తిగా బ్యాకప్ చేసుకోండి. తద్వారా, మీ డేటాని సురక్షితం చేసుకోవచ్చు.