అతిపెద్ద చాటింగ్ యాప్ వాట్సాప్ లో కొత్త ఫీచర్ లు వరుసగా టెస్టింగ్ కోసం సిద్ధమవుతున్నాయి. ఇటీవల వాట్సాప్ AI చాట్ బాట్ ను టెస్టింగ్ కోసం అందుబాటులోకి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు మరొక కొత్త వెరిఫికేషన్ ఫీచర్ ను కూడా యూజర్ సెక్యూరిటీ కోసం వాట్సాప్ తీసుకు వస్తోంది. గడిచిన కొన్ని నెలల్లో వాట్సాప్ నిరవధికంగా కొత్త ఫీచర్ లను జతచేస్తూనే వుంది.
వాట్సాప్ యూజర్ల అకౌంట్ సెక్యూరిటీని మరింతగా పెంచే దిశగా ఈ కొత్త ఫీచర్ ను వాట్సాప్ తీసుకు వస్తోంది. అదే, వాట్సాప్ ఇమెయిల్ అడ్రెస్ వెరిఫికేషన్ ఫీచర్. ఈ ఫీచర్ ద్వారా యూజర్ల లాగిన్ సెక్యూరిటీ మరింత పటిష్టం అవుతుంది. వాస్తవానికి, ఇప్పటి వరకూ కేవలం SMS ద్వారా మాత్రమే వెరిఫికేషన్ పరిమితమయ్యింది. అయితే, ఇప్పుడు ఈ పరిమితిని ఇమెయిల్ అడ్రెస్స్ వెరిఫికేషన్ వరకూ పెంచడానికి వాట్సాప్ కృషి చేస్తోంది.
వాట్సాప్ ఇమెయిల్ అడ్రెస్ వెరిఫికేషన్ కోసం ముందుగా యూజర్లు వారి వాట్సాప్ అకౌంట్ ను వారి ఇమెయిల్ తో జత చెయ్యాలి. చేసిన తరువాత వారి వాట్సాప్ అకౌంట్ ను లాగిన్ చేయడానికి ఇమెయిల్ అడ్రెస్స్ పైన కూడా వెరిఫికేషన్ కోడ్ అందుకోవచ్చు. మొబైల్ నెట్వర్క్ లేదా SMS సర్వీస్ లలో ఇబ్బందులు ఎదుర్కొనే సంయంలో కూడా ఈ ఫీచర్ ద్వారా ఇమెయిల్ పైన 6-డిజిట్ వెరిఫికేషన్ కోడ్ ద్వారా లాగిన్ చేసుకునే వీలుంటుంది.
Also Read : Jio Cloud Laptop: కొత్త కంప్యూటింగ్ విధానంతో చవక ధరలో ల్యాప్ టాప్స్ తెచ్చే పనిలో జియో.!
వాట్సాప్ యూజర్ సెక్యూరిటీ మేమియు అనుకూలత కోసం చాలా వేగంగా కొత్త ఫీచర్స్ ను తీసుకు వస్తున్న చాటింగ్ యాప్ గా నిలుస్తుంది. మరికొన్ని కొత్త ఉపయోగకరమైన ఫీచర్ లను కూడా వాట్సాప్ యోచిస్తోంది. ఇందులో, వాట్సాప్ యూజర్ల కోసం వర్చువల్ అసిస్టెంట్ గా పనిచేసే వాట్సాప్ AI చాట్ బోట్ ను టెస్టింగ్ కోసం US యూజర్లకు అందుబాటులో ఉంచింది.
ఈ వాట్సాప్ AI చాట్ బోట్ ఫీచర్ వాట్సాప్ యూజర్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలను మరియు కోరిన పనులకు ప్లాన్ లను కూడా అందిస్తుందని చెబుతున్నారు. ఈ ఫీచర్ ఇండియాలో టీసింగ్ కు అందుబాటులోకి త్వరలోనే వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది.