వాట్సాప్ లో కొత్త 'వాయిస్ స్టేటస్' ఫీచర్ ను తెచ్చింది. యూజర్లు వారి వాయిస్ ని స్టేటస్ రూపంలో పెట్టుకునే అవకాశం ఈ కొత్త 'Voice Status' ఫీచర్ ద్వారా మీ వాయిస్ రికార్డ్ చేసి మీ స్టేటస్ గా పోస్ట్ చేయవచ్చు. అంటే, మేము నచ్చిన వారికి గుడ్ మార్నింగ్ లేదా మీ తియ్యని మాటలను లేదా ఇంకేదైనా విషయాన్ని స్టేటస్ రూపమంలో వినిపించవచ్చు. ఈ కొత్త ఫీచర్ ఎలా పని చేస్తుంది మరియు ఈ వాట్సాప్ అకౌంట్ లో ఎలా పోస్ట్ చెయ్యాలో తెలుసుకోండి.
మీరు ఈ కొత్త ఫీచర్ ను మీ స్టేటస్ ట్యాబ్ లో చూడవచ్చు. అంటే, చాట్స్ పక్కన ఉండే స్టేటస్ బార్ లో మీరు రెగ్యులర్ గా చూసే స్టేటస్ లో 'Whatsapp' అని గ్రీన్ టిక్ తో కనిపిస్తుంది ఈ కొత్త ఫీచర్. దీన్ని నొక్కడం ద్వారా మీ వాయిస్ స్టేటస్ ను ఎలా క్రియేట్ చెయ్యాలో చూడవచ్చు.
Voice Status ని సెట్ చేసుకోవడం చాలా సింపుల్. ప్పటి వరకూ మీ My Status పైన నొక్కడం ద్వారా మీడియా ఫైల్స్ ను స్టేటస్ గా సెట్ చేసుకోవచ్చు. అయితే, ఈ కొత్త వాయిస్ స్టేటస్ కోసం మీ వాట్సాప్ లో Status బార్ లోకి వెళ్ళగానే ఇక్కడ మీకు My Status మరియు క్రింద మీ కాంటాక్ట్స్ లోని వారి Status క్రింద ఎడమ పక్క కెమేరా బటన్ కి పైన ఎడిట్ (పెన్) బటన్ ను నొక్కడం ద్వారా ఈ వాట్సప్ వాయిస్ స్టేటస్ ను సెట్ చేసుకోవచ్చు.
ఈ ఎడిట్ (పెన్) బటన్ పైన నొక్కిన తరువాత మీకు మైక్ బటన్ కనిపిస్తుంది. ఈ మైక్ బటన్ ను నొక్కి పట్టుకొని మీ వాయిస్ ని రికార్డ్ చేసి మీ స్టేటస్ గా పోస్ట్ చెయవచ్చు. ఇక్కడ మీరు కోరుకుంటే ఏదైనా టెక్స్ట్ ను కూడా రాసి పోస్ట్ చెయవచ్చు. ఈ వాయిస్ స్టేటస్ లో మరింత సౌకర్యం కోసం ఈ స్టేటస్ ని మీరు కోరుకునే వారికి లేదా మీ కాంటాక్ట్స్ లో ఉన్న అందరికి కనిపించేలా పోస్ట్ చెయ్యాలో కూడా మీరు సెట్ చేసుకునే వీలుంది. దీనికోసం మైక్ బటన్ పక్కన కనిపించే 'Status' బటన్ ను ఎంచుకోవాలి మరియు అందులో ఎవరు మీ స్టేటస్ చూడవచ్చునో ఎంచుకోవచ్చు.