వాట్స్ అప్ లో వీడియో కాలింగ్ ఫీచర్ ను అందరికీ రిలీజ్ చేసిన తరువాత కంపెని మరొక కొత్త ఫీచర్ ను ప్రవేశపెడుతుంది. దీని పేరు వీడియో స్ట్రీమింగ్.
సింపుల్ గా ప్రాక్టికల్ గా చెప్పాలంటే మీరు వాట్స్ అప్ లో వీడియోస్ ను చూడటానికి వాటి మీద క్లిక్ చేసినప్పుడు ముందు వీడియో మీ ఫోన్లోకి డౌన్లోడ్ అవుతుంది.
అది కంప్లీట్ అయ్యాక ప్లే అవుతుంది. సో వీడియో స్ట్రీమింగ్ ఫీచర్ రావటం వలన మీరు వీడియో పై టాప్ చేస్తే వీడియో డైరెక్ట్ గా ఆన్ లైన్ నుండి play అవుతుంది. కావాలంటే అక్కడే క్రింద ఉన్న డౌన్లోడ్ బటన్ తో డౌన్లోడ్ చేసుకోగలరు ఫోన్ లోకి.
అయితే అన్ని ఫీచర్స్ వలే ముందుగా బీటా users కు మాత్రమే అందిస్తుంది. యాప్ వెర్షన్ నంబర్ 2.16.365 లో ఉంది. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ బీటా లోనే చూడగలరు ఈ ఆప్షన్.
బీటా కు అప్లై చేయటనికి ఈ లింక్ లో తెలిపినట్లు చేయగలరు. మీ వాట్స్ అప్ లో ఇంకా వీడియో కాలింగ్ రాలేదా. ఈ లింక్ లోని స్టోరీ చదవండి అయితే.