జాగ్రత్త!! వాట్స్ అప్ లో వీడియో కాలింగ్ అంటూ హానికరమైన లింక్స్ హాల్ చల్ చేస్తున్నాయి

Updated on 21-Nov-2016

వాట్స్ అప్ బీటా మరియు బీటా కానీ వారికీ..అందరికీ వీడియో కాలింగ్ ఫీచర్ ను రిలీజ్ చేసింది. ఇది ఆల్రెడీ ఆండ్రాయిడ్, విండోస్ అండ్ ఐ OS ఫోన్లపై పనిచేస్తుంది కూడా.

అయితే ఈ సందర్భంగా కొంతమంది scammers ఇదే అవకాశంగా తీసుకొని ఫోన్లలోకి హానికరమైన codes ను పంపేందుకు కొన్ని తప్పుడు ఇన్విటేషన్ లింక్ లు మిగిలిన వారికి పంపుతున్నారు.

వాట్స్ లో మీకు ఒక లింక్ తో పాటు వాట్స్ అప్ వీడియో కాలింగ్ డౌన్లోడ్ అని వస్తుంది. ఈ లింక్ లోపల హానికరమైన కోడ్స్ చేస్తాయి. దానిపై క్లిక్ చేస్తే ఆ కోడ్స్ మీ ఫోనులోకి ఎంటర్ అవుతాయి మీకు తెలియకుండా.

కోడ్స్ ఎంటర్ అయితే మీ పర్సనల్ అండ్ secure డేటా ను access చేస్తుంది. ఇదే లింక్ గ్రూప్ కాలింగ్ ఫీచర్ తో కూడా వస్తుంది అని ఉంటుంది మెసేజ్ లో. అసలు ఆ ఫీచర్ వాట్స్ అప్ లో ఇంకా రాలేదు.

హానికరమైన లింక్/మెసేజ్ ఇలా ఉంటుంది…"You’re invited to try WhatsApp Video Calling feature. Only people with the invitation can enable this feature."  ఇమేజ్ పైన చూడగలరు.

ఈ లింక్ లో వాట్స్ అప్ వీడియో కాలింగ్ పై వ్రాసిన స్టోరీ చదవగలరు. ఒక వేల ఇంకా వీడియో కాలింగ్ ఫీచర్ ను మీ వాట్స్ అప్ లో చూడకపోతే ఈ లింక్ లో తెలిపినట్లు చేయగలరు.

Connect On :