Meta యాజమాన్యం లోని అతి పెద్ద మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరిన్ని కొత్త ఫీచర్స్ ను తీసుకు వస్తోంది. ఇప్పటికే అనేకమైన ఫీచర్లతో ఆకట్టుకుంటున్న వాట్సాప్, ఇప్పుడు మరొక కొత్త ఫీచర్ పైన కన్నేసింది. ఇంటర్నెట్ తో వాట్సప్ ద్వారా ఎటువంటి ఫైల్స్ అయినా పంపించవచ్చు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఆఫ్ లైన్ లో కూడా ఫైల్ షేరింగ్ చేసేలా కొత్త ఫీచర్ ని తీసుకురావాలని Whatsapp యోచిస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే, Internet లేకపోయినా ఫైల్ షేరింగ్ కోసం Whatsapp లో కొత్త ఫీచర్ తీసుకురావడానికి చూస్తోంది.
వాట్సాప్ లో ఏదైనా ఫైల్ షేర్ చేయాలంటే ఇంటర్నెట్ కచ్చితంగా అవసరం అవుతుంది. అయితే, ఇంటర్నెట్ సదుపాయం లేకున్నా సరే ఫైల్ షేర్ చేయడానికి కొత్త ఫీచర్ ని తెచ్చే పనిలో వాట్సాప్ ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి, చాలా కాలంగా ఈ ఫీచర్ ని తేవడానికి వాట్సప్ ప్రయత్నిస్తోంది. అయితే, ఇప్పుడు ఈ ఫీచర్ ని అందుబాటులోకి తేవడానికి అతిదగ్గరలో ఉన్నట్లు తెలుస్తోంది.
Wabetainfo ఈ విషయాన్ని మరియు ఈ ఫీచర్ ను తెలియ చేస్తూ స్క్రీన్ షాట్ లను కూడా వెల్లడించింది. ఈ స్క్రీన్ షాట్ ద్వారా ఇంటర్నెట్ లేకుండానే మీడియా ఫైల్ లను ఎలా షేర్ చెయ్యాలో కూడా
Also Read: ఈరోజు Amazon జబర్దస్త్ Smart Watch ఆఫర్లను ప్రకటించింది.!
వాట్సప్ తీసుకురానున్న ఈ అప్ కమింగ్ ఫీచర్ ని ‘People Nearby’ ఫీచర్ గా చెబుతోంది. ఈ ఫీచర్ ను Android 2.24.2.20 అప్డేట్ తో అందించవచ్చని తెలిపింది. ఫోటోలు, వీడియోలు, డాక్యూమెంట్స్ వంటి మరిన్ని ఫైల్స్ ని ఎటువంటి ఇంటర్నెట్ అవసరం లేకుండా nearby ఫీచర్ తో దగ్గరలోని ఇతర యూజర్లకు షేర్ చేసే వీలుంది. ఈ ఫీచర్ ని జత చెయ్యడానికి వాట్సాప్ పని చేస్తోంది.
దీని గురించి వాట్సాప్ బీట్స్ వెర్షన్ Android 2.24.2.20 లో సవిరంగా స్క్రీన్ షాట్ ద్వారా వెల్లడించినట్లు కూడా ఈ నివేదిక తెలిపింది.
ఇది చాలా సింపుల్ ప్రస్తుతం మార్కెట్ లో లభిస్తున్న చాలా స్మార్ట్ ఫోన్ లలో ఉన్న Quick Share మాదిరిగానే ఫైల్స్ ను దగ్గరలోని ఇతర యూజర్లకు పంపించవచ్చు. ఈ అప్ కమింగ్ ఫీచర్, వాట్సాప్ లో ఎలా పని చేస్తుందని పైన అందించిన స్క్రీన్ షాట్ లో చూడవచ్చు.
ఈ ఫీచర్ కోసం వాట్సాప్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ‘People Nearby’ ఆప్షన్ ను ఎంచుకోవడం ద్వారా మీడియా ఫైల్స్ ను షేర్ చేయవచ్చు. ఇది పంపించే మరియు రిసీవ్ చేసుకునే ఇద్దరూ వాట్సాప్ యూజర్లు కూడా ఆన్ చేయవలసి ఉంటుంది.