WhatsApp Upcoming ఫీచర్ ఒకదానికి వాబీటాఇన్ఫో బయటపెట్టింది. ఇప్పటికే అనేకమైన ఫీచర్స్ ని యూజర్స్ కోసం వాట్సాప్ యాప్ లో పరిచయం చేసిన మెటా, ఇప్పుడు మరొక కొత్త ఫీచర్ ను కోడోత్ జత చేస్తోంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా షేర్డ్ ఇమేజ్ లను వెబ్ పై నేరుగా సెర్చ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్ సెర్చ్ పరిధిని మరింత అనుకూలంగా మార్చడానికి వీలుపడుతుంది.
వాట్సాప్ కొత్తగా షేర్డ్ ఇమేజ్ లను వెబ్ పై నేరుగా శే రిచ్ చేయడానికి వీలు కల్పించే ఫీచర్ ను వాట్సాప్ కి జత చేస్తుందని వాబీటాఇన్ఫో వెల్లడించింది. అంతేకాదు, ఈ ఫీచర్ ను వివరించే స్క్రీన్ షాట్ లను కూడా వాబీటాఇన్ఫో అధికారిక X అకౌంట్ నుంచి షేర్ కూడా చేసింది. ఈ ట్వీట్ నుంచి వాట్సాప్ అందించిస్తున్న కొత్త ఫీచర్ కూడా చూపించింది. ఈ ట్వీట్ ను ఇక్కడ చూడవచ్చు.
ఈ వాట్సాప్ కొత్త ఫీచర్ ఇప్పటికే కొంత మంది బీటా టెస్టర్ లకు అందుబాటులో ఉంచినట్లు కూడా వెల్లడించింది. ఈ ఫీచర్ ను అందుకున్న బీటా టెస్టర్స్ ఈ ఫీచర్ ను పరీక్షించడానికి అవకాశం ఉంటుంది. ఈ కొత్త ఫీచర్ ని వివరించే స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడవచ్చు.
ఈ కొత్త ఫీచర్ ద్వారా వచ్చిన ఇమేజ్ సోర్స్ మరియు ఇమేజ్ వాలిడేషన్ ను కూడా జస్ట్ సింగిల్ క్లిక్ తో చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ను ఉపయోగించడానికి వెరిఫై చేయాలనుకునే ఇమేజ్ పై ట్యాప్ చేసి సేవ్, ఫార్వర్డ్ మరియు షేర్ బటన్ లకు క్రింద కనిపించే కొత్త ఆప్షన్ ల్లో కనిపించే ‘Search On Web’ పైన క్లిక్ చేయాలి. వెంటనే యూజర్ కోరుకున్న ఇమేజ్ ను వెబ్ ద్వారా సెర్చ్ చేసి సోర్స్ మరియు ఆల్టర్నేటివ్ ఇమేజ్ లను అందిస్తుంది.
Also Read: iQOO 13 Launch: 2K స్క్రీన్ మరియు డ్యూయల్ Chipset తో ఇండియా లాంచ్ కన్ఫర్మ్.!
వాట్సాప్ అందిస్తున్న ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్ ప్రైవసీ మరియు సెక్యూరిటీకి మరింత బలం చేకూరుతుంది. ఈ విధంగా వెస్బ్ సెర్చ్ చేయడానికి వాట్సాప్ ఫోన్ లో ఉన్న గూగుల్ లెన్స్ సహాయం తీసుకుంటుంది.