Whatsapp: వాట్సాప్ లో రానున్న ఈ అప్ కమింగ్ ఫీచర్ గురించి మీకు తెలుసా? ఒకవేళ తెలియకుంటే ఈరోజు తెలుసుకోండి. యూజర్ల మొబైల్ నెంబర్ స్థానంలో యూజర్ నేమ్ ను అందించే విధంగా కొత్త ఫీచర్ ను వాట్సాప్ తీసుకు వస్తునట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ తో నెంబర్ కు బదులుగా యూజర్ నేమ్ ను అందించే అవకాశం ఉంటుంది. అంటే, మీరు మీరు నెంబర్ ను ఇతరులకు ఇవ్వడం ఇష్టపడకుంటే మీ యూజర్ నేమ్ ను ఇస్తే సరిపోతుంది.
ఈ కొత్త ఫీచర్ రానున్న అప్ కమింగ్ అప్డేట్ ద్వారా లభిస్తుందని చెబుతోంది. ఈ ఫీచర్ అందుకున్న యూజర్లు వారి అకౌంట్ లో వారి యూజర్ నేమ్ ను సొంతగా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ యూజర్ నేమ్ అనేది @ తో ప్రారంభమ అవుతుంది మరియు మీరు మీకు నచ్చిన నేమ్ తో మీరు క్రియేట్ చేసుకోవచ్చు.
ఇక ఈ ఫీచర్ వాట్సాప్ యొక్క 2.23.11.15 అప్డేట్ తో అందుతుందని WABetaInfo వెల్లధించింది. ఇక ఇటీవల వచ్చిన కొత్త ఫీచర్ ను గురించి మాట్లాడితే, రీసెంట్ గా వాట్సాప్ లో editing message ఫీచర్ కొత్తగా వచ్చింది. ఈ ఫీచర్ ద్వారా సెండ్ చేసిన మెసేజీని కూడా ఎడిట్ చేసి సరి చేసుకోవచ్చు. దీని కోసం సెండ్ చేసిన మెసేజ్ పైన లాంగ్ ప్రెస్ చేసి వచ్చిన అప్షన్ లలో 'edit' అప్షన్ ను ఎంచుకోవాలి.
అయితే, ఈ ఎడిట్ మెసేజ్ అప్షన్ మెసేజ్ పంపిన 15 నిముషాల లోపల మాత్రమే ఆయా మెసేజీని ఎడిట్ చేసే అవకాశం ఉంటుంది.