వాటప్స్ శరవేగంగా కొత్త ఫీచర్లను తన యాప్ కి జతచేస్తోంది మరియు ఈ చాటింగ్ యాప్ ను మరింత శక్తివంతంగా మారుస్తోంది. ఇటీవలే యూజర్ల కోసం ChatLock, Edit Message మరియు మల్టీ ఫోన్ యూసేజ్ వంటి గొప్ప ఉపయోగకరమైన ఫీచర్లను అందించిన వాట్సాప్, ఇప్పుడు మరొక ఉపయోగరకమైన కొత్త ఫీచర్ ను వాట్సాప్ యూజర్ల కోసం తీసుకు వస్తోంది.
వాట్సాప్ లో కొత్త ఫీచర్ ను యద చేస్తున్నట్లు wabetainfo స్క్రీన్ షాట్స్ తో సహా వివరాలను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పంచుకుంది. wabetainfo ప్రకారం, వాట్సాప్ అప్ కమింగ్ అప్డేట్ నుండి iOS మరియు Android ఫోన్లలో కూడా HD Photo లను నేరుగా షేర్ చేయవచ్చని సూచించింది. వాట్సాప్ యూజర్లు ఈ కొత్త ఫీచర్ ను అప్ కమింగ్ అప్డేట్ ద్వారా అందుకుంటారని తెలిపింది.
https://twitter.com/WABetaInfo/status/1666221155961692163?ref_src=twsrc%5Etfw
ఇప్పటికే కొంత మంది బీటా టెస్టర్లకి ఈ కొత్త ఫీచర్ HD Photo షేరింగ్ అప్షన్ ను అందుబాటులో ఉన్నట్లు కూడా ఈ ట్వీట్ ద్వారా వెల్లడించింది.
వాస్తవానికి, HD Photo షేరింగ్ కోసం ప్రస్తుతం చాలా మంది యూజర్లు Document అప్షన్ ను ఎంచుకుంటున్నారు. అంటే, ఫోటోలను డాక్యునెంట్ అప్షన్ ద్వారా ఎటువంటి నష్టం లేకుండా క్వాలిటీ ఫోటోలను పంపించ గలుగుతున్నారు. అయితే, వాట్సాప్ అప్ కమింగ్ ఫిచర్ తో నేరుగా HD Photo షేర్ చెయ్యొచ్చన్న మాట.