వాట్స్ అప్ లో పంపిన మెసేజ్ లను ఎడిట్, undo అండ్ డిలిట్ చేసే ఆప్షన్స్
వాట్స్ అప్ లో రెండు కొత్త ఫీచర్స్ యాడ్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇవి ఇప్పటివరకూ చేస్తున్న చాటింగ్ కు మరింత భిన్నమైన మార్పులు.
ఆల్రెడీ అవతల వ్యక్తికి పంపిన మెసేజ్ లను ఎడిట్ చేయటానికి లేదా ఉపసంహరించటానికి వీలు కలిపించే ఫీచర్ పై పనిచేస్తుంది అని తాజా రిపోర్ట్స్.
జిమెయిల్ లో ఉండే undo send ఫీచర్ మాదిరిగా ఇది పనిచేస్తుంది అని WABetaInfo రిపోర్ట్స్. రాంగ్ పర్సన్స్ లేదా రాంగ్ మెసేజెస్ వంటి వాటికి తావు లేకుండా చేస్తుంది ఇది.
అవతల వ్యక్తికి చెరక ముందే undo చేసేది ఒకటి, చేరి ఆ వ్యక్తి చదివిన తరువాత కూడా పంపిన మెసేజ్ ను ఎడిట్ లేదా కంప్లీట్ డిలిట్ చేసే మరొక ఫీచర్ వస్తుంది అని చెబుతున్నాయి ఈ రిపోర్ట్స్.
పైన పేర్కొన్న ఫీచర్స్ వెర్షన్ నంబర్ 2.17.1.869 లో వచ్చే అవకాశాలున్నాయి. మొదటిగా ఐ OS కు రాగా ఆ తరువాత ఆండ్రాయిడ్ అండ్ విండోస్ లకు రానుంది. ఆల్రెడీ ఆపిల్ ఫోనులపై టెస్ట్ స్టేజ్ లో ఉంది.