Whatsapp లో ఈ సెట్టింగ్స్ చేశారంటే మీ ప్రైవసీ పూర్తిగా సేఫ్

Whatsapp లో ఈ సెట్టింగ్స్ చేశారంటే మీ ప్రైవసీ పూర్తిగా సేఫ్
HIGHLIGHTS

మీ ప్రైవసీ గురించి అసలు ఆలోచించాల్సిన పనిలేకుండా చేసే మంచి సెట్టింగ్స్ గురించి ఈరోజు తెలియచేస్తున్నాను.

ఈ ప్రపంచం మొత్తంలో దాదాపుగా 25% జనాభా Whatsapp ని వాడుతున్నారు. అంటే, ఫ్రీ నలుగురిలో ఒకరు వాట్సాప్ వినియోగదారుడే అని చెప్పొచ్చు. అంతటి గొప్ప ప్రాచుర్యం మరియు నెట్వర్క్ కలిగిన ఈ అప్లికేషన్ మీరు కూడా వాడుతూనే ఉండి ఉంటారు, అవునా!. అయితే, మీలో చాలా మందికి కూడా మీ ప్రైవసీ గురించి ఎన్నో సందేహాలు వస్తుంటాయి. అన్నిటిలోకి ముఖ్యంగా మన చాటింగ్ లేదా ప్రైవేట్ వివరాలను మరింకెవరైనా చూస్తారేమోనని అనిపిస్తుంటుంది. అందుకోసమే, మీరు మీ ప్రైవసీ గురించి అసలు ఆలోచించాల్సిన పనిలేకుండా చేసే మంచి సెట్టింగ్స్ గురించి ఈరోజు తెలియచేస్తున్నాను. వీటితో, మీరు సమర్ధవంతమైన ప్రైవసీ రక్షణతో పాటుగా, మీరు ఎవరితో ఎక్కువగా చాటింగ్, మీడియా లేదా కాలింగ్ వంటి వాటిని చేస్తున్నారో కూడా తెలుసుకోవచ్చు.

1. Self -Distracting మెసేజి

మీరు చేసే మెసేజీని మీకు ప్రియమైన వారు చుసిన తరువాత దాన్ని ఆటోమ్యాటిగ్గా తొలిగించాలని చూసే వారికీ చక్కగా ఉపయోగపడుతుంది. అదే ఈ Self -Distracting మెసేజి ఫీచర్. దీని ద్వారా, వినియోగదారులు వాట్సాప్‌లో పంపే మెసేజిలు ఎంతకాలం ఉండాలో అంత సమయాన్ని ఎంచుకోవచ్చు. ఆ తర్వాత ఈ చాటింగ్ ఆటొమ్యాటిగ్గా తొలగించబడతాయి. ఈ ఫీచర్ ప్రారంభించడానికి, వినియోగదారులు గ్రూప్ సెట్టింగ్‌లకు వెళ్లడం ద్వారా దీన్ని చేయవచ్చు. ప్రస్తుతం, వాట్సాప్ 5 సెకన్లు మరియు 1 గంట అనే రెండు ఆప్షన్లను అందిస్తుంది.

2. ఫింగర్ ప్రింట్ సెన్సార్

ముందుగా,  టచ్ ID మరియు పేస్ అన్లాక్ ఫీచర్లను ఐఫోన్ వినియోగదారులకు తీసుకొచ్చిన సంస్థ, ఇప్పుడు ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడా 'ఫింగర్ ప్రింట్ లాక్' ఫీచరును అందించింది.  దీనితో, కేవలం మీరు మాత్రమే మీ వాట్స్ ఆప్ మెసేజిలు  మరియు డేటాని చూడవచ్చు. మీ ఫింగర్ ప్రింట్ లేకుండా వేరేవారు మీ వాట్స్ ఆప్ ఓపెన్ చేసే అవకాశముండదు.  

ఈ విధంగా ఫింగర్ ప్రింట్ సెట్ చేసుకోవాలి : Settings > Account > Privacy > Finger Print Lock       

3. టూ – స్టెప్ వెరిఫికేషన్ సెట్టింగ్

ఈ సెట్టింగ్ నిజంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ప్రధాన సెట్టింగ్ గా చెప్పొచ్చు. దీనిని ఎనేబుల్  చెయ్యడం వలన మీరు మీ సెక్యూరిటీని మరింతగా సురక్షితం చేసుకున్న వారవుతారు. ఈ టూ – స్టెప్ వెరిఫికేషన్ లో మీరు ఆరు అంకెల పాస్వర్డ్ ను సెట్ చెయ్యాల్సి ఉంటుంది. దీని ద్వారా, మీరు మీ వాట్సాప్ రీ ఇన్స్టాల్ లేదా మరొక ఫోన్లో ఇన్స్టాల్ చెయ్యడానికి ఈ పాస్ కోడ్ తో మాత్రమే చెయ్యగలరు.

ఈ విధంగా టూ – స్టెప్ వెరిఫికేషన్ సెట్ చేసుకోవాలి : Settings > Account > Two-Step Verification > Enable         

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo