WhatsApp: ఫైల్ షేరింగ్ కోసం అద్భుతమైన కొత్త ఫీచర్ తెచ్చిన వాట్సాప్.!
ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం కొత్త ఉపయోగకరమైన WhatsAppకొత్త ఫీచర్
ఐఫోన్ AirDrop మాదిరిగా నియర్ బై షేరింగ్ ను ఇది అందిస్తుంది
ఫైల్ షేరింగ్ కోసం ఈ అద్భుతమైన కొత్త ఫీచర్ ను వాట్సాప్ తీసుకు వచ్చింది
Whatsapp: అతిపెద్ద మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం కొత్త ఉపయోగకరమైన కొత్త ఫీచర్ తెచ్చే పనిలో పడింది. ఐఫోన్ లలో అత్యంత ఉపయోగకరమైన ఫైల్ షేరింగ్ ఫీచర్ AirDrop మాదిరిగా నియర్ బై షేరింగ్ ను ఇది అందిస్తుంది. ఆండ్రాయిడ్ యూజర్లకు ఫైల్ షేరింగ్ కోసం ఈ అద్భుతమైన కొత్త ఫీచర్ ను వాట్సాప్ తీసుకు వచ్చింది.
Whatsapp File Sharing Feature
వాట్సాప్ ఫైల్ షేరింగ్ ఫీచర్ ను ప్రస్తుతం గూగుల్ పాలీ స్టోర్ లో బీటా టెస్టర్స్ కోసం అందుబాటులో ఉంచినట్లు wabetainfo రిపోర్ట్ తెలిపింది. ఈ కొత్త ఫీచర్ ఎలా పని చేస్తుందో కూడా తెలిపింది. ఈ రిపోర్ట్ ప్రకారం, వాట్సాప్ తీసుకు వచ్చిన కొత్త ఫీచర్ ‘Share file With Near by people’ ఫైల్స్ ను పంపడానికి లేదా అందుకోవడానికి ఉపయోగపడుతుంది.
సింపుల్ గా డివైజ్ ను షేక్ చేయడం ద్వారా ఫైల్స్ ను షేర్ లేదు రిసీవ్ చేసుకోవడం చేసే వీలుంటుందని తెలిపింది. అయితే, ఇదంతా కూడా వాట్సాప్ అప్ కమింగ్ ఫైల్ షేరింగ్ ఫీచర్ ఎలా పని చేస్తుందని తెలిపే వివరణ మాత్రమే. వాస్తావనికి, ఈ కొత్త ఫీచర్ ఎలా పని చేస్తుందో తెలుసుకోవాలంటే మాత్రం మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.
Also Read : OnePlus 12R: వన్ ప్లస్ కొత్త ఫోన్ ధర మరియు Top-5 ఫీచర్లు తెలుసుకోండి.!
వాట్సాప్ ఫైల్ షేరింగ్ ఫీచర్ ప్రస్తుతానికి డెవలప్మెంట్ స్టేజ్ లోనే వుంది. ఈ ఫీచర్ పూర్తిగా రిలీజ్ లేదా వినియోగం లోకి రావడానికి మరికొంత సమయం పడుతుందని ఈ రిపోర్టు తెలియ చేసింది.
ఇది మాత్రమే కాదు, వాట్సాప్ మరిన్ని కొత్త ఉపయోగకరమైన ఫీచర్లను కూడా తీసుకురావడానికి చూస్తోంది. Whatsapp Web లో Dark Interface మరియు User Name వంటి కొత్త ఫీచర్లు ఉండనున్నట్లు చెబుతన్నారు. అంటే, మొబైల్ యాప్ తో పాటుగా డిస్క్ టాప్ వెబ్ యాప్ లో కూడా కొత్త ఫీచర్లను జోడించే దిశగా వాట్సాప్ పని చేస్తున్నట్లు మనం అర్ధం చేసుకోవచ్చు.