వాట్స్ అప్ బీటా users కు కంపెని కొత్త ఫీచర్ యాడ్ చేసింది. ఇది అందరికీ కనిపించదు. బీటా కు రిజిస్టర్ అయ్యి ఉండి…
మరియు ఫోన్ ను మీరు root చేసి ఉంటేనే కనిపిస్తుంది. ఈ అప్డేట్ వెర్షన్ -v2.16.336. దశల వారిగా బీటా users అందరికీ విడుదల అవుతుంది. సో కొంతమందికి ఇంకా కనిపించకపోవచ్చు.
ఇంతకీ ఫీచర్ ఏంటంటే… మీరూ వాట్స్ అప్ ఓపెన్ చేయగానే కనిపించే 3 టాబ్స్ home లో నాలుగవ టాబ్ ఉంటుంది. ఇది కాల్స్ మరియు chats మధ్యలో ఉంటుంది.
ఈ నాలుగవ టాబ్ పేరు status tab. మన పేరు ,ప్రొఫైల్ ఇమేజ్ స్టేటస్ చూపిస్తుంది. దీని ద్వారా users తమ కాంటాక్ట్స్ లో ఉన్న వారికి ఇమేజెస్ మరియు వీడియోస్ ను షేర్ చేయగలరు.
ఇది కొంచెం instagram లో రీసెంట్ గా యాడ్ అయిన instagram stories లాంటి ఫీచర్ అని తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితమే బీటా users కు(రూటింగ్ అవసరం లేదు) వాట్స్ అప్ లో వీడియో కాలింగ్ ఫీచర్ యాడ్ అయ్యింది. దాని డిటేల్స్ ఈ లింక్ లో చూడగలరు.
వాట్స్ అప్ బీటా వెర్షన్ ను మీ ఫోన్ లో ఇంస్టాల్ చేసుకోవటానికి ఈ లింక్ లో తెలిపినట్లు చేయండి.