ఆండ్రాయిడ్, విండోస్ & ఇతర ఓల్డ్ OS వెర్షన్స్ పై వాట్స్ అప్ సపోర్ట్ నిలిపివేత
By
Karthekayan Iyer |
Updated on 05-Dec-2016
వాట్స్ అప్ చాటింగ్ యాప్ త్వరలోనే ఓల్డ్ ఆండ్రాయిడ్ వెర్షన్, iOS, విండోస్, బ్లాక్ బెర్రీ అండ్ నోకియ symbian OS లపై రన్ అయ్యే డివైజెస్ కు సపోర్ట్ నిలిపివేయనుంది.
ఆల్రెడీ కంపెని ఫెబ్రవరి 2016 లో ఈ విషయాన్ని వెల్లడించింది కాని తరువాత బ్లాక్ బెర్రీ మరియు Symbian OS లకు సపోర్ట్ ను జూన్ 30, 2017 వరకూ కొనసాగింపు చేస్తుంది అని తెలిపింది మరలా.
ఈ ఇయర్ ఎండింగ్ లో మాత్రం ఆండ్రాయిడ్ 2.2 వెర్షన్ ఆండ్రాయిడ్ ఫోనులు, iOS 6 అండ్ విండోస్ 7 లేదా వీటి కన్న తక్కువ వెర్షన్ వాడుతున్న డివైజెస్ పై వాట్స్ అప్ పనిచేయదు.
అయితే మార్కెట్ లో కూడా వీటిపై రన్ అయ్యే డివైజెస్ చాలా తక్కువ పెర్సెంట్ లో ఉంటాయి అని వాట్స్ అప్ గణాంకాలు చెబుతున్నాయి.