WhatsApp గుడ్ న్యూస్: అతిపెద్ద మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో కొత్త ఫీచర్ యాడ్ అవుతోంది. ఇప్పటివరకు కేవలం గూగుల్ ప్రీమియం ఫోన్స్ అయిన Pixel ఫోన్ లలో మాత్రమే అందుబాటులో ఉన్న వాయిస్ మెసేజ్ తర్జుమా ఫీచర్ ను వాట్సాప్ తెస్తోంది. ఇప్పుడు ఈ కొత్త ఫీచర్ అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లకు జత చేయాలని యోచిస్తోంది. ఈ కొత్త ఫీచర్ అప్డేట్ తో బీటా వెర్షన్ ను కూడా విడుదల చేసింది. ఈ ఫీచర్ తో వాయిస్ మెసేజ్ లను మీకు అవసరమైన లేదా మీకు నచ్చిన భాష లోకి తర్జుమా చేసుకోవచ్చు.
ఇప్పటికే వాట్సాప్ లో గుట్టల కొద్దీ కొత్త ఫీచర్ లను అందించింది. అయితే, యూజర్ అనుకూలత మరియు అవసరాల మేరకు కొత్త ఫీచర్ లను ఇంకా జత చేస్తూ వుంది. ఇప్పుడు కూడా వాట్సాప్ లో Voice Transcript Language ఫీచర్ ను జత చేసే పనిలో పడింది. ఈ కొత్త ఫీచర్ తో కూడిన బీటా వెర్షన్ ను కూడా వాట్సాప్ విడుదల చేసింది. ఈ విషయాన్ని wabetainfo ముందుగా వెల్లడించింది మరియు ఈ ఫీచర్ వివరాలు తెలియజేసే స్క్రీన్ షాట్ ను కూడా షేర్ చేసింది.
వాబీటాఇన్ఫో ప్రకారం, వాట్సాప్ బీటా ఫర్ ఆండ్రాయిడ్ వెర్షన్ 2.24.15.5 అప్డేట్ తో ఈ కొత్త వాయిస్ ట్రాన్స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఫీచర్ ను జత చేసింది. ఇది ప్రస్తుతం బీటా టెస్టర్స్ కోసం అందుబాటులో ఉంది. ఈ కొత్త అప్డేట్ ను బీటా టెస్టర్స్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ అందించే భాషలు మరియు ఫీచర్ వివరాలు తెలిపే స్క్రీన్ షాట్ ను కూడా వాట్సాప్ షేర్ చేసింది.
Also Read: iQOO Neo 9s Pro+: Sony లేటెస్ట్ పవర్ ఫుల్ కెమెరా మరియు భారీ ఫీచర్లతో లాంచ్ చేసింది.!
వాబీటాఇన్ఫో షేర్ చేసిన స్క్రీన్ షాట్ లో రీడ్ యువర్ వాయిస్ మెసేజెస్ విత్ ట్రాన్స్క్రిప్ట్ అని ఆప్షన్ అందుతుంది. ఇందులో అందించిన లాంగ్వేజ్ ను ఎంచుకోవడం ద్వారా యూజర్ కు వచ్చిన వాయిస్ మెసేజ్ ను వారికి నచ్చిన భాషలోకి తర్జుమా చేసి వినిపిస్తుంది. ఈ ఫీచర్ ద్వారా ఎవరి వాయిస్ మెసేజ్ ను అయినా యూజర్ కుప్రియమైన భాషలో వినే సౌలభ్యం అందుతుంది.