WhatsApp కొత్త అప్డేట్ తో ఇన్ యాప్ డయలర్ ఫీచర్ అందిస్తోంది.!

Updated on 24-Jun-2024
HIGHLIGHTS

WhatsApp కొత్త అప్డేట్ ను బీటా టెస్టర్స్ కోసం అందుబాటులోకి తీసుకు వచ్చింది

ఈ కొత్త అప్డేట్ తో ఇన్ యాప్ డయలర్ ఫీచర్ ను యూజర్లకు అందిస్తున్నట్లు తెలిపింది

కాల్స్ సెక్షన్ లో కొత్త డైలర్ ఆప్షన్ ను వాట్సాప్ జత చేసింది

WhatsApp కొత్త అప్డేట్ ను బీటా టెస్టర్స్ కోసం అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ కొత్త అప్డేట్ తో ఇన్ యాప్ డయలర్ ఫీచర్ ను యూజర్లకు అందిస్తున్నట్లు తెలిపింది. ఈ కొత్త అప్డేట్ ప్రస్తుతం బీటా టెస్టర్స్ కోసం అందుబాటులో వుంది. యూజర్ అనుభూతిని మరింత అద్భుతంగా మార్చడానికి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు జత చేసే వాట్సాప్ ఇప్పుడు ఈ కొత్త ఫీచర్ ను జత చేస్తోంది.

WhatsApp కొత్త అప్డేట్

వాట్సాప్ అప్డేట్ లను అందరికంటే ముందుగా అందించే WABetaInfo ఈ కొత్త అప్డేట్ గురించి వివరాలు అందించింది. వెబ్ బీటా ఇన్ఫో అధికార X అకౌంట్ నుండి ఈ కొత్త విషయాన్ని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ప్రకారం, వాట్సాప్ 2.24.13.17 అప్డేట్ ను బీటా టెస్టర్ ల కోసం రిలీజ్ చేసింది. ఈ కొత్త అప్డేట్ తో ఇన్ యాప్ డయలర్ ఫీచర్ అందుతుందని తెలిపింది. ఈ విషయాన్ని రూడీ చేసే స్క్రీన్ షాట్ ను కూడా షేర్ చేసింది. కాల్స్ సెక్షన్ లో కొత్త డైలర్ ఆప్షన్ ఉన్నట్లు ఈ స్క్రీన్ షాట్ లో కనిపిస్తోంది.

WhatsApp In App Dialer

ఈ కొత్త ఇన్ యాప్ డైలర్ ఫీచర్ బీటా టెస్టర్ లతో పాటుగా కొంతమంది యూజర్లకు అందుబాటులోకి వచ్చిందని, ఈ ఫీచర్ తో క్విక్ గా వాట్సాప్ కాల్ ని డయల్ చేసుకోవచ్చని తెలిపింది. అంతేకాదు, ఈ కొత్త ఇన్ యాప్ డైలర్ ఫీచర్ తో అడ్రెస్స్ బుక్ లేదా కాంటాక్ట్ ను యాడ్ చేసే పని లేకుండా నేరుగా నంబర్ డయల్ చేసి కాల్ చేసే వీలుంటుందని కూడా చెప్పింది.

ఇప్పటి వరకూ వాట్సాప్ ఫాలో అవుతూ వస్తున్న సంప్రదాయ కాలింగ్ పద్ధతి నుంచి ఈ కొత్త ఫీచర్ తో వెసులుబాటును అందిస్తుంది. ఎటువంటి చిక్కులు లేకుండా సింపుల్ గా నెంబర్ డైలీ చేసి కాలింగ్ చేసే అవకాశం ఈ కొత్త ఫీచర్ తో ఉంటుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్ ఎక్స్ పీరియన్స్ ను మరింత సౌక్యరం గా మారుతుందని మేము భావిస్తున్నాము. ఈ ఫీచర్ ను అందుకోవడానికి గూగుల్ ప్లే స్టోర్ నుంచి వాట్సాప్ బీటా లేటెస్ట్ వెర్షన్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Also Read: Redmi Note 13 Pro 5G అందమైన కొత్త రెడ్ కలర్ వేరియంట్ లో లాంచ్ అవుతోంది.!

అయితే, అతి త్వరలోనే ఈ ఫీచర్ ను యూజర్స్ అందరికీ అందుబాటులోకి తీసుకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే, వాట్సాప్ తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ మరియు ఫోన్ లో యాప్ డౌన్లోడ్ చేయబడి ఉంటేనే ఈ ఫీచర్ తో కాల్ చేయడం సాధ్యపడుతుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :